ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మార్చి నెల 22 వ తేదీ మధ్యాహ్నం పూట 12:30 గంటల కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగే ఒక కార్యక్రమం లో పాల్గొని, నూతన ఇంటర్ నేశనల్ టెలికమ్యూనికేశన్ యూనియన్ (ఐటియు) ఏరియా ఆఫీస్ & ఇనొవేశన్ సెంటరు ను ప్రారంభించనున్నారు. ఇదే కార్యక్రమం లో భాగం గా, భారత్ 6జి విజన్ డాక్యుమెంటు ను ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారు. అలాగే, 6జి కి చెందినటువంటి ఆర్&డి టెస్ట్ బెడ్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు. ప్రధాన మంత్రి ‘కాల్ బిఫోర్ యు డిగ్’ అనే ఏప్ ను సైతం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొనే సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.
ఐటియు అనేది ఇన్ ఫర్ మేశన్ ఎండ్ కమ్యూనికేశన్ టెక్నాలజీ స్ (ఐసిటి స్) కు ఉద్దేశించిన ఐక్య రాజ్య సమితి యొక్క ప్రత్యేక సంస్థ. దీని ప్రధాన కేంద్రం జెనీవా లో ఉంది. ఐటియు కు క్షేత్ర కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాలు మరియు ఏరియా ఆఫీసు ల నెట్ వర్క్ సైతం ఏర్పాటయింది. ఏరియా ఆఫీసు ను నెలకొల్పడం కోసమని 2022 వ సంవత్సరం మార్చి నెల లో ఐటియు తో భారతదేశం ఒక హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ పై సంతకాలు చేసింది. ఈ ఏరియా ఆఫీసు కు అనుబంధం గా ఒక ఇనొవేశన్ సెంటర్ ఉంటుంది. దీని తో ఐటియు యొక్క ఇతర ఏరియా ఆఫీసుల తో పోలిస్తే ఇది ఒక విశిష్టమైన కార్యాలయం గా పేరు తెచ్చుకొంటుంది. ఏరియా ఆఫీసు స్థాపన కు అయ్యే ఖర్చులన్నిటినీ భారతదేశం భరించింది. ఈ ఆఫీసు ను న్యూ ఢిల్లీ లోని మహ్ రౌలీ లో గల సెంటర్ ఫార్ డెవలప్ మెంట్ ఆఫ్ టెలిమేటిక్స్ (సి-డిఒటి) భవనం యొక్క రెండో అంతస్తు లో స్థాపించడం జరిగింది. ఈ ఆఫీసు భారతదేశంతో పాటు నేపాల్, భూటాన్, బాంగ్లాదేశ్, శ్రీ లంక, మాల్దీవులు, అఫ్ గానిస్తాన్, ఇంకా ఇరాన్ లకు సేవల ను అందించనుంది. ఇది దేశాల మధ్య సమన్వయాన్ని అధికం చేయడం తో పాటుగా ఆ ప్రాంతం లో పరస్పర హితకర ఆర్థిక సహాయ సహకారాల ను ప్రోత్సహిస్తుంది.
భారత్ 6జి విజన్ డాక్యుమెంటు ను టెక్నాలజీ ఇనొవేశన్ గ్రూప్ ఆన్ 6జి (టిఐజి-6జి) రూపొందించింది. టిఐజి-6జి ని భారతదేశం లో 6జి కోసం మార్గసూచీ ని మరియు కార్యాచరణ ప్రణాళిక ను అభివృద్ధి పరచడం కోసం వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు, పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ లు, విద్య రంగ సంస్థ లు, ప్రమాణీకరణ సంబంధి సంస్థ లు, టెలికం సర్వీస్ ప్రొవైడర్స్ తో పాటు పరిశ్రమ కు చెందిన సభ్యుల తో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు మార్పు చేర్పుల కు లోనవుతూ ఉన్నటువంటి ఐసిటి సాంకేతికత లను పరీక్షించి, అవి సక్రమం గా ఉన్నాయని ప్రకటించేందుకు గాను ఒక వేదిక ను విద్య రంగ సంస్థల కు, పరిశ్రమ కు, స్టార్ట్-అప్స్ కు, సూక్ష్మ, లఘు, మధ్యతరహా వాణిజ్య సంస్థల (ఎమ్ఎస్ఎమ్ఇ స్)కు, పరిశ్రమ కు 6జి టెస్ట్ బెడ్ అందించనుంది. భారత్ 6జి విజన్ డాక్యుమెంట్, ఇంకా 6జి టెస్ట్ బెడ్ లు దేశం లో నూతన ఆవిష్కరణ లు, సామర్థ్యం పెంపుదల మరియు సాంకేతిక విజ్ఞానాన్ని వేగవంతం గా అక్కున చేర్చుకోవడం కోసం ఒక అనువైనటువంటి వాతావరణాన్ని ఏర్పరుస్తాయి.
పిఎమ్ గతిశక్తి లో భాగం గా మౌలిక సదుపాయాల కు సంబంధించిన కనెక్టివిటీ ప్రాజెక్టుల ను సమన్వయంతో అమలుపరచడం మరియు ఏకీకృత ప్రణాళిక రచన అనే ప్రధాన మంత్రి దృష్టికోణాని కి నిదర్శన గా కాల్ బిఫోర్ యు డిగ్ (సిబియుడి) ఏప్ ను సంకల్పించడం జరిగింది. ఇది ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వంటి భూమి లోపల ఉండేటటువంటి ఆస్తుల కు ఎటువంటి నష్టం ఎదురవకుండా చూసేందుకు ఉద్దేశించిన ఒక సాధనం. సమన్వయం లోపించినటువంటి తవ్వకం పనుల వల్ల ఈ తరహా నష్టం సంభవిస్తున్నాయి. ఫలితం గా దేశం ఏటా సుమారు 3,000 కోట్ల రూపాయల వరకు నష్టపోతోంది. సిబియుడి మొబైల్ ఏప్ తవ్వకందారు సంస్థల ను మరియు ఆస్తి యాజమాన్య సంస్థల ను ఎస్ఎమ్ఎస్/ఇ-మెయిల్ నోటిఫికేశన్ మరియు క్లిక్ టు కాల్ మాధ్యాల ద్వారా సంధాన పరుస్తూ, దేశం లో తవ్వకం పనులు ఒక క్రమ పద్ధతి లో జరిగేందుకు తోడ్పడుతుంది. దీనితో భూ గర్భం లో గల ఆస్తుల సురక్ష కు పూచీపడుతుంది.
సిబియుడి దేశ పాలన లో ‘సంపూర్ణ ప్రభుత్వ దృక్పథాన్ని’ ఆచరణ లోకి తీసుకు రావాలి అని చాటిచెప్పే సిబియుడి వ్యాపారం చేయడం లో సౌలభ్యాన్ని మెరుగుపరచడం ద్వారా స్టేక్ హోల్డర్స్ అందరికీ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది వ్యాపార పరం గా ఎదురుకాగల నష్టం బారి నుండి తప్పించడం తో పాటుగా రహదారులు, టెలికమ్యూనికేశన్స్, నీరు, గ్యాసు మరియు విద్యుత్తు వంటి అత్యవసర సేవల అందజేత లో అంతరాయాల ను తగ్గించడం వల్ల పౌరుల కు అసౌకర్యాన్ని వీలైనంత మేరకు కుదించి వేస్తుంది.
ఈ కార్యక్రమం లో ఐటియు యొక్క వివిధ ఏరియా ఆఫీసుల తాలూకు ఐటి/టెలికమ్ మంత్రులు, ఐటియు యొక్క సెక్రట్రి జనరల్ మరియు ఇతర సీనియర్ అధికారులు, ఐక్య రాజ్య సమితి / భారతదేశం లోని ఇతర అంతర్జాతీయ సంస్థల అధిపతులు, రాయబారులు , పరిశ్రమ ప్రముఖులు, స్టార్ట్-అప్ మరియు ఎమ్ఎస్ఎమ్ఇ ప్రముఖులు, విద్య రంగ ప్రముఖులు, విద్యార్థులు మరియు అన్య స్టేక్ హోల్డర్స్ పాలుపంచుకోనున్నారు.