‘ఇంటర్ నేశనల్ లాయర్స్ కాన్ఫరెన్స్ 2023’ ను 2023 సెప్టెంబర్ 23 వ తేదీ న ఉదయం 10 గంటల వేళ కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
" న్యాయాన్ని అందించే వ్యవస్థ లో సరిక్రొత్త గా ఉనికి లోకి వస్తున్న సవాళ్ళు’ అనే ఇతివృత్తం పై ‘ఇంటర్ నేశనల్ లాయర్స్ కాన్ఫరెన్స్ 2023’ ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. దీనిని 2023 సెప్టెంబర్ 23 వ మరియు 24 వ తేదీల లో నిర్వహించనున్నారు. వివిధ చట్ట విషయాల పైన అర్థవంతమైనటువంటి సంభాషణల కై మరియు చర్చల కై ఒక వేదిక ను అందుబాటులోకి తీసుకు రావడం సమ్మేళనం యొక్క ఉద్దేశ్యం గా ఉంది. ఈ సందర్భం లో జాతీయం గా మరియు అంతర్జాతీయంగా ప్రాముఖ్యం ఉన్నటువంటి అనేక చట్ట సంబంధి అంశాల ను చర్చించడం జరుగుతుంది. ఆలోచనల ను మరియు అనుభవాల ను వెల్లడించడం తో పాటు గా చట్ట సంబంధి అంశాల పైన అంతర్జాతీయ సహకారాన్ని మరియు అవగాహన ను పటిష్టం చేయడం జరుగుతుంది. దేశం లో మొట్టమొదటిసారి గా నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశాలలో ప్రస్తుతం ఉనికి లోకి వస్తున్న చట్ట సరళులు, సరిహద్దుల కు ఆవల వ్యాజ్యాల లో సవాళ్ళు, చట్టాని కి సంబంధించినటువంటి సాంకేతిక విజ్ఞానం, పర్యావరణ సంబంధి చట్టం వగైరా విషయాల ను ఈ సమావేశం లో చర్చించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమం లో ప్రసిద్ధ న్యాయమూర్తులు, చట్ట రంగం లో వృత్తి నిపుణులు తో పాటు ప్రపంచ చట్ట సముదాయం లోని ప్రముఖులు పాలుపంచుకోనున్నారు.