భారతదేశం లో అతిపెద్దదైన డ్రోన్ ఫెస్టివల్ - ‘భారత్ డ్రోన్ మహోత్సవ్ 2022’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే 27వ తేదీ న ఉదయం 10 గంటల కు న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ప్రారంభించనున్నారు.
కిసాన్ డ్రోన్ పైలట్ లతో ప్రధాన మంత్రి మాటామంతీ జరుపుతారు;ఓపన్ ఎయర్ డ్రోన్ విన్యాసాల ను కూడా ఆయన తిలకిస్తారు; అంతే కాక, డ్రోన్ ప్రదర్శన కేంద్రం లో డ్రోన్ స్టార్ట్-అప్స్ తో ప్రధాన మంత్రి చర్చిస్తారు.
భారత్ డ్రోన్ మహోత్సవ్ 2022’ ను రెండు రోజుల పాటు మే 27వ తేదీ, మే 28వ తేదీ లలో నిర్వహించనున్నారు. మహోత్సవం లో ప్రభుత్వ అధికారులు, విదేశీ దౌత్యవేత్త లు, సాయుధ బలగాలు, కేంద్రీయ సాయుధ పోలీసు బలగాలు, పిఎస్ యు లు, ప్రైవేటు కంపెనీ లు మరియు డ్రోన్ స్టార్ట్-అప్స్ మొదలైన వి సహా 1600 కన్నా ఎక్కువ మంది ప్రతినిధులు పాలుపంచుకొంటారు. ప్రదర్శన లో 70కి పైగా ఎగ్జిబిటర్ లు డ్రోన్ యొక్క వివిధ ఉపయోగాల ను గురించి కళ్ళ కు కడతాయి. మహోత్సవం లో ఇతర కార్యక్రమాల కు తోడు, డ్రోన్ పైలట్ సర్టిఫికెట్ లను వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రదానం చేయడం, ఉత్పత్తుల ను ప్రవేశపెట్టడం, సామూహిక చర్చ, డ్రోన్ ప్రయోగాలు, మేడ్ ఇన్ ఇండియా డ్రోన్ టాక్సీ యొక్క ప్రొటోటైపు ను ప్రదర్శించడం మొదలైన వాటిని చేర్చడం జరిగింది.