ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 3 వ తేదీ న ఉదయం పూట సుమారు 10 గంటల వేళ కు విజ్ఞాన్ భవన్ లో కామన్‌వెల్థ్ లీగల్ ఎడ్ యుకేశన్ అసోసియేశన్ (సిఎల్ఇఎ) - కామన్‌వెల్థ్ అటార్నీస్ ఎండ్ సలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్ (సిఎఎస్‌జిసి) 2024 ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో హాజరు అయ్యే జనసమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.
‘‘న్యాయం అందజేత లో సరిహద్దుల కు ఆవలి వైపు నుండి ఎదురయ్యే సవాళ్ళు’’ అనేది ఈ సమావేశం యొక్క ఇతివృత్తం గా ఉంది. ఈ సమావేశం లో న్యాయ వ్యవస్థ లో పరివర్తన మరియు లీగల్ ప్రాక్టీసు యొక్క నైతిక పార్శ్వాలు; కార్యనిర్వహణ సంబంధి జవాబుదారుతనం తదితర విషయాల కు తోడు ఆధునిక కాలం లో న్యాయ విద్య పై పున: సమీక్ష ను చేపట్టడం వంటి చట్టం, న్యాయం లకు సంబంధించిన ముఖ్యమైన విషయాల ను చర్చించడం జరుగుతుంది.
ఈ సమావేశం లో వివిధ అంతర్జాతీయ ప్రతినిధి వర్గాల తో పాటు ఏశియా-పసిఫిక్, ఆఫ్రికా మరియు కేరేబియన్ లో విస్తరించినటువంటి కామన్‌వెల్థ్ సభ్యత్వ దేశాల కు చెందిన అటార్నీ జనరల్స్, ఇంకా సలిసిటర్స్ కూడా పాలుపంచుకోనున్నారు. ఈ సమావేశం కామన్‌వెల్థ్ దేశాల యొక్క చట్ట రంగం సంబంధి స్టేక్ హోల్డర్స్ మధ్య మాటామంతీ కి గాను ఒక విశిష్టమైనటువంటి వేదిక వలె పని చేయనుంది. ఈ సమావేశం లో న్యాయ విద్య మరియు అంతర్జాతీయం గా న్యాయాన్ని అందించడం లో ఎదురవుతున్న సవాళ్ళ ను పరిష్కరించడం కోసం ఒక విస్తృతమైనటువంటి మార్గసూచీ ని అభివృద్ధి పరచాలన్న ఉద్దేశ్యం తో అటార్నీస్ మరియు సలిసిటర్స్ జనరల్ కోసం ఒక ప్రత్యేకమైన గుండ్రని బల్ల సమావేశాన్ని కూడా ను నిర్వహించడం జరుగుతుంది.