ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఫిబ్రవరి 25 వ తేదీ న సాయంత్రం 5 గంటల కు దిల్లీ లోని తాల్ కటోరా స్టేడియమ్ లో సాంస్కృతిక ఉత్సవం ‘బారిసు కన్నడ డిం డిమవ’ ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో పాలుపంచుకొనే జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు కూడాను.
ప్రధాన మంత్రి యొక్క ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ దార్శనికత కు అనుగుణం గానే కర్నాటక యొక్క సంస్కృతి ని, సంప్రదాయాల ను మరియు చరిత్ర ను ఘనం గా ఓ ఉత్సవం లాగా జరపడం కోసం సాంస్కృతిక ఉత్సవమైనటువంటి ‘బారిసు కన్నడ డిం డిమవ’ ను నిర్వహించడం జరుగుతున్నది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఆధ్వర్యం లో నిర్వహించే ఈ ఉత్సవం లో వందల కొద్దీ కళాకారుల కు నృత్యం, సంగీతం, నాటకం, కవిత మొదలైన కళారూపాల మాధ్యం ద్వారా కర్నాటక యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని కళ్ల కు కట్టేందుకు గాను ఒక అవకాశం లభించనుంది.