ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 4 వ తేదీ న మధ్యాహ్నం ఒంటి గంట వేళ లో దేహ్ రాదూన్ లో పర్యటించనున్నారు. దాదాపు గా 18,000 కోట్ల రూపాయల వ్యయం కలిగిన పలు ప్రాజెక్టుల లో కొన్నిటిని ఆయన ప్రారంభించి మరి కొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమైన రహదారుల కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన ను మెరుగు పరచడం పై ఈ పర్యటన కాలం లో శ్రద్ధ తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టు లు ప్రయాణాన్ని సాఫీ గా, సురక్షితం గా మలచగలవు. అంతేకాదు, ఈ ప్రాంతం లో పర్యటన అవకాశాల ను కూడా పెంచగలవు. ఒకప్పుడు చేరుకోవడం కష్టం అని భావించిన మారుమూల ప్రాంతాల కు సంధానం సౌకర్యాన్ని పెంచాలన్న మంత్రి దృష్టి కోణాని కి అనుగుణం గా ఈ ప్రాజెక్టు లు ఉన్నాయి.
ప్రధాన మంత్రి 11 అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన చేయనున్నారు. వీటి లో దిల్లీ-దేహ్ రాదూన్ ఇకనామిక్ కారిడార్ ( ఈస్టర్న్ పెరిఫరల్ ఎక్స్ ప్రెస్- వే జంక్శన్ నుంచి దేహ్ రాదూన్ వరకు) చేరి ఉంది. దీనిని సుమారు 8,300 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించడం జరుగుతుంది. ఇది దిల్లీ నుంచి దేహ్ రాదూన్ మధ్య ప్రయాణ కాలాన్ని ఆరు గంటల నుంచి తగ్గించి దాదాపు 2.5 గంటలు గా చేసేస్తుంది. దీనిలో హరిద్వార్, ముజఫ్ఫర్ నగర్, శామ్ లీ, యమునానగర్, బాగ్ పత్, మేరఠ్, ఇంకా బఢౌత్ లతో సంధానం కోసం ఏడు ప్రముఖ ఇంటర్ చేంజ్ లు ఉంటాయి. దీనిలో వన్య ప్రాణులు యథేచ్ఛ గా సంచరించడం కోసం ఏశియాలోనే అతి పెద్ద వైల్డ్ లైఫ్ ఎలివేటెడ్ కారిడార్ 12 కిలో మీటర్ల మేర రూపుదిద్దుకోనుంది. దీనితో పాటు, దేహ్ రాదూన్ లో దత్ కాళీ ఆలయానికి సమీపం లో 340 మీటర్ ల పొడవైన సొరంగ మార్గం వన్య ప్రాణుల పై పడే ప్రభావాన్ని తగ్గించడం లో సహాయకారి కానుంది. దీనికి అదనం గా, గణేశ్ పుర్ - దేహ్ రాదూన్ సెక్షను లో జంతువుల ను వాహనాలు డీకొట్టే ఘటనల ను తప్పించడం కోసం జంతువులకై అనేక మార్గాల ను కూడా ఏర్పాటు చేయడమైంది. దిల్లీ-దేహ్ రాదూన్ ఇకనామిక్ కారిడార్ లో 500 మీటర్ అంతరం తో వర్ష జల సేకరణ కు ఉద్దేశించిన వ్యవస్థ మరియు 400 కు పైగా నీటి సంబంధి రీచార్జి పాయింట్ లు కూడా ఉంటాయి.
దిల్లీ-దేహ్ రాదూన్ ఎకనామిక్ కారిడార్ నుంచి సహారన్ పుర్ లోని హల్ గోవా నుంచి హరిద్వార్ లోని భద్రాబాద్ ను కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ అలైన్ మెంట్ ప్రాజెక్టు పేరు తో ఒక ప్రాజెక్టు ను 2000 కోట్ల కు పైగా వ్యయం తో నిర్మించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు దిల్లీ నుంచి హరిద్వార్ కు నిరంతరాయ సంధానాన్ని సమకూర్చుతుంది, యాత్ర కు పట్టే సమయాన్ని సైతం తగ్గిస్తుంది. 1600 కోట్ల రూపాయల కు మించిన వ్యయం తో నిర్మాణం అయ్యేటటువంటి మనోహర్ పుర్ నుంచి కాంగడీ ల వరకు హరిద్వార్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు, హరిద్వార్ నగర నివాసుల కు విశేషించి భారీ పర్యటక వాతావరణం లో రాకపోకల స్తంభన నుంచి ఊరట ను ఇవ్వగలదు. ఇంకా కుమావూన్ క్షేత్రం తో సంధానాన్ని కూడాను మెరుగు పరచగలదు.
సుమారు 1700 కోట్ల రూపాయలు ఖర్చు తో నిర్మాణం అయ్యేట దేహ్ రాదూన్- పోంటా సాహిబ్ (హిమాచల్ ప్రదేశ్) రోడ్డు ప్రాజెక్టు యాత్ర కు పట్టే కాలాన్ని తగ్గించగలగడం తో పాటు రెండు ప్రాంతాల మధ్య నిరంతరాయ సంధాన సదుపాయాన్ని సమకూర్చుతుంది. దీనితో అంతర్ రాష్ట్ర పర్యటన కు కూడా దన్ను లభించగలదు. నాజిమాబాద్-కోట్ ద్వార్ రహదారి ని విస్తరించే పథకం ప్రయాణానికి పట్టే కాలాన్ని తగ్గించి, లాన్స్ డవున్ నుంచి సంధానాన్ని సైతం మెరుగు పరచగలదు.
లక్ష్మణ్ ఝూలా కు దగ్గరలో గంగా నది మీదు గా ఒక వంతెన ను కూడా నిర్మించడం జరుగుతుంది. ప్రపంచ ప్రసిద్ధి ని పొందినటువంటి లక్ష్మణ్ ఝూలా ను 1929వ సంవత్సరం లో నిర్మించడమైంది. కానీ ఇప్పుడు దీనిని వాహనాలను భరించే సామర్థ్యం క్షీణించిన కారణం గా మూసి వేయడం జరిగింది. కొత్త గా నిర్మించే వంతెన మీద కాలినడక న పోయే వారి కోసం గ్లాస్ డెక్ సదుపాయం ఉంటుంది, దీనితో పాటే తేలికపాటి బరువు గల వాహనాలు దాటిపోవడానికి కూడా అనుమతి ఉంటుంది.
దేహ్ రాదూన్ లో బాలల కు ప్రయాణం కోసం రహదారుల ను సురక్షితం గా తీర్చిదిద్ది నగరాన్ని బాలల మేలు కోరేది గా మలచడం కోసం చైల్డ్ ఫ్రెండ్ లీ సిటీ ప్రాజెక్ట్, దేహ్ రాదూన్ కు కూడా ప్రధాన మంత్రి తన పర్యటన కాలం లో శంకుస్థాపన చేయనున్నారు. దేహ్ రాదూన్ లో 700 కోట్ల రూపాయలకు పైబడిన ఖర్చు తో నీటి సరఫరా, రహదారులు, ఇంకా మురుగు పారుదల వ్యవస్థ ల అభివృద్ధి సంబంధి పథకాల కు సైతం శంకుస్థాపన చేయడం జరుగుతుంది.
ప్రధాన మంత్రి దృష్టి కోణాని కి అనుగుణం గా స్మార్ట్ స్పిరిట్యువల్ టౌన్స్ ను అభివృద్ధి పరచి, పర్యటన సంబంధి మౌలిక సదుపాయాల స్థాయి ని పెంచడం కోసం శ్రీ బద్రీనాథ్ ధామ్ లో, గంగోత్రి- యమునోత్రి ధామ్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల కు శంకుస్థాపన జరుగనుంది. వీటితో పాటే, 500 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో హరిద్వార్ లో ఒక కొత్త మెడికల్ కాలేజీ ని నిర్మించడం జరుగుతుంది.
మరో ఏడు పథకాల ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రాంతం లో కొండచరియ లు విరిగి పడుతున్నందు వల్ల చాలా కాలం గా ఎదురవుతున్న సమస్య ను తీర్చడం కోసం యాత్ర ను సురక్షితమైందిగా మలచడం పట్ల జాగ్రత పాటించాలనేది దీనిలో ఓ భాగం గా ఉంది. ఈ ప్రాజెక్టుల లో లంబ్ గద్ ( ఇది బద్రీనాథ్ ధామ్ మార్గం లో ఉంది) లో లాండ్ స్లయిడ్ మిటిగేశన్ ప్రాజెక్టు, ఎన్ హెచ్-58 లో శకనిధర్, శ్రీనగర్, ఇంకా దేవ్ ప్రయాగ లో గంభీర భూపాతం సమస్య నివారణ వంటివి చేరి ఉన్నాయి. గంభీర భూపాతం క్షేత్రం లో లంబ్ గద్ ల్యాండ్ స్లయిడ్ మిటిగేశన్ ప్రాజెక్టు ను చేపట్టడం లో.. వర్షాల నుంచి కాపాడే గోడ ను నిర్మించడం మరియు రాక్ ఫాల్ బాధ ల నివారణ కు ఉద్దేశించిన నిర్మాణాలు.. కలిసి ఉంటాయి. ప్రాజెక్టు యొక్క స్థలం దీని వ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని మరింత గా పెంచుతున్నది.
చార్ ధామ్ రహదారి సంధాన పథకం లో భాగం గా దేవ్ ప్రయాగ్ నుంచి శ్రీకోట్ వరకు మరియు ఎన్ హెచ్- 58 లో బ్రహ్మపురి నుంచి కొడియాలా వరకు రోడ్డు ను వెడల్పు చేసే ప్రాజెక్టు ను సైతం ప్రారంభించడం జరుగుతోంది.
దేహ్ రాదూన్ లో హిమాలయన్ కల్చరల్ సెంటర్ తో పాటే1700 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో యమునా నది మీద నిర్మాణం జరిగినటువంటి 120 మెగావాట్ సామర్ధ్యం కలిగిన వ్యాసీ జలవిద్యుత్తు ప్రాజెక్టు ను ప్రారంభించడం జరుగుతుంది. హిమాలయన్ కల్చరల్ సెంటర్ లో ఒక రాష్ట్ర స్థాయి మ్యూజియమ్ ఏర్పాటవుతుంది. 800 మంది కూర్చునేందుకు తగిన ఏర్పాటులతో కూడినటువంటి ఒక ఆర్ట్ ఆడిటోరియమ్, గ్రంథాలయం, సమావేశ భవనం వంటివి ప్రజల కు సాంస్కృతిక కార్యకలాపాల లో పాలుపంచుకోవడం లోను, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించడం లోను తోడ్పాటు ను అందించగలుగుతాయి.
ప్రధాన మంత్రి ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ పర్ ఫ్యూమరీ ఎండ్ అరోమా లబారటరి ని (సెంటర్ ఫార్ అరోమాటిక్ ప్లాంట్స్) కూడా దేహ్ రాదూన్ లో ప్రారంభించనున్నారు. ఇక్కడ జరిగే పరిశోధన లు సబ్బులు, పరిమళ ద్రవ్యాలు, శానిటైజర్స్, ఎయర్ ఫ్రెశనర్స్, అగరు బత్తీలు వగైరా లు సహా విధ విధాలైన ఉత్పాదనల ను తయారు చేయడానికి ఉపయోగకారి గా నిరూపణ కాగలవు. అంతేకాక ఈ కార్యకలాపాల తో సంబంధం కలిగిన పరిశ్రమ లు ఆ ప్రాంతం లో ఏర్పాటు కావడానికి కూడా ఇది దోహదం చేయగలదు. సుగంధి మొక్కల లో అధిక దిగుబడి ని ఇచ్చే తరహా ఉన్నతమైనటువంటి రకాల ను అభివృద్ధి పరచడం పట్ల కూడా ఈ అత్యాధునిక పర్ ఫ్యూమరీ ఎండ్ లబారటరి శ్రద్ధ వహించనుంది.