ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో జనవరి 12వ తేదీ నాడు సాయంత్రం 4 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా తమిళ నాడు లో 11 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల లను, చెన్నై లో సెంట్రల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ కు చెందిన ఒక కొత్త కేంపస్ ను ప్రారంభించనున్నారు.
కొత్త గా వైద్య కళాశాల ను దాదాపు గా 4,000 కోట్ల రూపాయల అంచనా ఖర్చు తో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ మొత్తం లో సుమారు గా 2145 కోట్ల రూపాయల ను కేంద్ర ప్రభుత్వం, మిగిలిన సొమ్ము ను తమిళ నాడు ప్రభుత్వం అందించాయి. కొత్త వైద్య కళాశాల లు ఏర్పాటు అవుతున్న జిల్లాల లో విరుధునగర్, నమక్కల్, నీలగిరీ, తిరుపుర్, తిరువళ్ళూర్, నాగపట్టినమ్, దిండిగల్, కల్లాకురిచీ, అరియాలూర్, రామనాథపురం, ఇంకా కృష్ణగిరి జిల్లా లు ఉన్నాయి. ఈ వైద్య కళాశాల లను దేశం లో అన్ని ప్రాంతాల లో తక్కువ ఖర్చు తో వైద్య విద్య బోధన ను ప్రోత్సహించాలన్న మరియు ఆరోగ్య సంబంధి మౌలిక సదుపాయాల కల్పన ను మెరుగు పరచాలన్న ప్రధాన మంత్రి నిరంతర ప్రయాస కు అనుగుణం గా నెలకొల్పడం జరుగుతున్నది. ‘ఇప్పటికే ఉన్న జిల్లా ఆసుపత్రి/రెఫరల్ ఆసుపత్రి లకు జతపడ్డ కొత్త వైద్య కళాశాల లను స్థాపించడం’ అనే కేంద్ర ప్రాయోజిత పథకం లో భాగం గా మొత్తం 1450 సీట్లు ఉండే కొత్త మెడికల్ కాలేజీల ను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ పథకం లో ప్రభుత్వ వైద్య కళాశాల గాని, లేదా ప్రైవేటు వైద్య కళాశాల గాని లేనిటువంటి జిల్లాల లో వైద్య కళాశాల లను ఏర్పాటు చేస్తారు.
భారతదేశం యొక్క వారసత్వాన్ని పరిరక్షించాలన్న, శాస్త్రీయ భాషల ను ప్రోత్సహించాలన్న ప్రధాన మంత్రి దార్శనికత కు అనుగుణం గా చెన్నై లో సెంట్రల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ (సిఐసిటి) యొక్క కొత్త కేంపస్ ను స్థాపించడం జరుగుతున్నది. కొత్త కేంపస్ ను 24 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించడమైంది. దీనికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయి లో ఆర్థిక సహాయం చేసింది. ఇంతవరకు ఒక కిరాయి భవనం లో కార్యకలాపాలను నిర్వహిస్తూ వచ్చిన సిఐసిటి ఇప్పుడు మూడు అంతస్తులతో కూడిన ఒక నూతన కేంపస్ నుంచి పని చేస్తుంది. కొత్త కేంపస్ లో విశాలమైనటువంటి ఒక పుస్తకాలయం, ఒక ఇ-లైబ్రెరీ, చర్చా సభ కోసం పెద్ద పెద్ద గదుల తో పాటు ఒక మల్టీ మీడియా హాల్ ఉన్నాయి.
కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో గల స్వయం ప్రతిపత్తి సంస్థ అయినటువంటి సిఐసిటి తమిళ భాష తాలూకు ప్రాచీనత ను మరియు విశిష్టత ను ప్రతిష్ఠింపచేయడం కోసం పరిశోధన కార్యకలాపాల మాధ్యమం ద్వారా శాస్త్రీయ తమిళ భాష వ్యాప్తి లో తోడ్పాటు ను అందిస్తున్నది. సంస్థ కు చెందిన గ్రంథాలయం లో 45,000కు పైగా ప్రాచీన తమిళ పుస్తకాల సమృద్ధ సంగ్రహం ఉన్నది. శ్రాస్తీయ తమిళాన్ని ప్రోత్సహించడం, శాస్త్రీయ తమిళ విద్యార్థుల కు అండదండల ను అందించడం కోసం ఈ సంస్థ చర్చా సభల, శిక్షణ కార్యక్రమాల నిర్వహించడం, ఫెలోశిప్ ప్రదానం చేయడం వంటి విద్య సంబంధి కార్యకలాపాల ను నిర్వహిస్తున్నది. ‘తిరుక్కురళ్’ ను వివిధ భారతదేశ భాషల తో పాటు 100 విదేశీ భాషల లోకి అనువాదం చేసి, ఆ గ్రంథాన్ని ప్రచురించడం అనేవి ఈ సంస్థ ధ్యేయం గా ఉంది. ప్రపంచ వ్యాప్తం గా శాస్త్రీయ తమిళ భాష వ్యాప్తి దిశ లో పాటుపడాలన్న ఈ సంస్థ ఆశయం నెరవేరేందుకు కొత్త కేంపస్ ఒక ప్రభావవంతమైనటువంటి కార్యశీల వాతావరణాన్ని ప్రసాదించనుంది.