సెంటర్- స్టేట్ సైన్స్ కాన్ క్లేవ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ పదో తేదీ నాడు ఉదయం 10 గంటల 30 నిమిషాల వేళ లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు కూడాను.
దేశం లో నవ పారిశ్రామికత్వాని కి మరియు నూతన ఆవిష్కరణల కు (ఎస్ టిఐ) సంబంధించిన ఇకోసిస్టమ్ కై మార్గాన్ని సుగమం చేయడం కోసం ప్రధాన మంత్రి అలుపెరుగక చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణం గా ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇది తనదైన కోవ కు చెందిన ఒకటో సమ్మేళనం గా ఉన్నది. సహకారాత్మక సమాఖ్యవాదం యొక్క భావన తో కేంద్రాని కి మరియు రాష్ట్రాల కు మధ్య సమన్వయ భరితమైన, సహకార భరితమైన యంత్రాంగాన్ని పటిష్టపరచడం తో పాటు గా యావత్తు దేశం లో విజ్ఞానశాస్త్రం, సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణ ల సంబంధి ఇకోసిస్టమ్ ను కూడా నిర్మించాలి అనేదే సమ్మేళనం యొక్క లక్ష్యం గా ఉంది.
రెండు రోజుల పాటు ఈ సమ్మేళనాన్ని 2022వ సంవత్సరం లో సెప్టెంబర్ 10వ, 11 వ తేదీల లో అహమదాబాద్ లోని సైన్స్ సిటీ లో నిర్వహిస్తున్నారు. దీనిలో.. ఎస్ టిఐ విజన్ 2047; రాష్ట్రాల లో ఎస్ టిఐ కోసం భావి వాకాసానికి మార్గాలు మరియు విజన్; ఆరోగ్యం – అందరి కోసం డిజిటల్ హెల్థ్ కేర్; 2030వ సంవత్సరానికల్లా పరిశోధన మరియు అభివృద్ధి లలో ప్రైవేటు రంగం యొక్క పెట్టుబడుల ను రెండింతలు చేయడం; వ్యవసాయం- రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించకోవడం; జలం- త్రాగడానికి పనికివచ్చే నీటి ని ఉత్పత్తి చేయడం కోసం నూతన ఆవిష్కరణలు; శక్తి- హైడ్రోజన్ మిశన్ లో విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం ల యొక్క భూమిక మొదలైన వాటి తో పాటు అందరి కోసం స్వచ్ఛ శక్తి; డీప్ ఓశన్ మిశన్ మరియు కోస్తా తీర రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు దేశం యొక్క భవిష్య కాలం లోని ఆర్థిక వ్యవస్థ కై వీటి ప్రాసంగికత వంటి వివిధ ఇతివృత్తాల పై నిర్వహించే సమావేశాలు .. కలసి ఉండబోతున్నాయి.
ఈ కోవ కు చెందిన మొట్టమొదటి సమ్మేళనం లో గుజరాత్ ముఖ్యమంత్రి, కేంద్ర విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం (ఎస్ ఎండ్ టి) శాఖ సహాయ మంత్రి, ఇంకా రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ఎస్ ఎండ్ టి శాఖ మంత్రులు, కార్యదర్శులు, పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖులు, నవపారిశ్రామికులు, ప్రభుత్వేతర సంస్థ (ఎన్ జిఒ) లు, యువ శాస్త్రవేత్త లు మరియు విద్యార్థులు పాలుపంచుకోనున్నారు.