మధ్య ప్రదేశ్ లో వీధుల్లో వస్తువులను విక్రయించే వారి తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 సెప్టెంబర్ 9 న ‘స్వనిధి సంవాద్’ ను నిర్వహించనున్నారు.
వీధుల్లో తిరుగుతూ వస్తువులను విక్రయించే పేదలు కోవిడ్-19 సంక్షోభకాలం లో ఇబ్బందుల పాలవడంతో, వారు మళ్లీ జీవనోపాధి కార్యక్రమాలను ప్రారంభించుకొనేందుకు భారత ప్రభుత్వం ‘పిఎం స్వనిధి’ పథకాన్ని 2020 జూన్ 1 న ప్రారంభించింది.
మధ్య ప్రదేశ్ లో 4.5 లక్షల మంది వీధి వర్తకులు ఈ పథకం లో వారి పేర్లను నమోదు చేసుకున్నారు. వారిలో 4 లక్షల మందికి పైగా వర్తకులకు గుర్తింపు ను, అమ్మకందారు ధ్రువపత్రాన్ని ఇవ్వడమైంది. అర్హులైన 2.45 లక్షల లబ్ధిదారుల దరఖాస్తులను పోర్టల్ ద్వారా బ్యాంకుల కు సమర్పించడం జరిగింది. వాటిలో దాదాపు గా 1.4 లక్షల వీధి వ్యాపారస్తుల కు 140 కోట్ల రూపాయల విలువైన సొమ్ము ను మంజూరు చేయడమైంది. ఆమోదం లభించిన మొత్తం దరఖాస్తుల లో మధ్య ప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానం లో నిలిచింది. ఈ ఒక్క రాష్ట్రం నుంచే 47 శాతం దరఖాస్తులు వచ్చాయి.
రాష్ట్రం లో ఈ పథకం లబ్దిదారులు స్వనిధి సంవాద్ కార్యక్రమాన్ని చూసేందుకు 378 పురపాలక సంస్థల లో బహిరంగ ప్రదేశాల లో ఎల్ ఇడి తెరల ను ఏర్పాటు చేయడం ద్వారా అవసరమైన సన్నాహాలు చేయడమైంది.
ఈ కార్యక్రమాన్ని వెబ్ కాస్ట్ పద్ధతి లో ప్రసారం చేయనున్నారు. దీని కోసం మైగవ్ (MyGov) కు చెందిన https://pmevents.ncog.gov.in/ లింకు లో ముందు గా రిజిస్ట్రేషన్ లు కొనసాగుతున్నాయి.
మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ కార్యక్రమం లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాలుపంచుకొంటారు.
రాష్ట్రానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులతో వారి విక్రయ ప్రదేశాల నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ గా సంధానమై, వారితో మాట్లాడతారు. ‘పిఎం స్వనిధి’ పథకంపై రాష్ట్రం రూపొందించిన ఒక చిత్రాన్ని కూడా ఈ కార్యక్రమం లో భాగం గా ప్రదర్శించనున్నారు.