ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే నెల 25 వ తేదీ న ఉదయం పూట 11 గంటల కు దేహ్ రాదూన్ నుండి దిల్లీ కి ప్రయాణించే వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభ సూచక ఆకుపచ్చటి జెండా ను చూపించి, ఆ రైలు యాత్ర బయలుదీరేటట్టు చూస్తారు.
ఇది ఉత్తరాఖండ్ లో ఒకటో వందే భారత్ రైలు కానున్నది. ప్రపంచ స్థాయి సదుపాయాలు జతపడ్డ ఈ ఎక్స్ ప్రెస్ రైలు ప్రత్యేకించి రాష్ట్రం లో ప్రయాణించే పర్యటకుల కు వారి యాత్ర హాయి గా ఉండేదిగా ప్రయాణానుభవం తాలూకు ఒక క్రొత్త శకాన్ని మొదలుపెట్టనున్నది. రైలు ను పూర్తి గా స్వదేశం లో రూపొందించడమైంది. దీనిలో కవచ్ తరహా సాంకేతిక పరిజ్ఞానం సహా అన్ని ఉన్నతమైన సురక్ష సంబంధి సౌకర్యాలను జోడించడమైంది.
ప్రజల కు స్వచ్ఛమైన రవాణా సాధనాల ను సమకూర్చాలన్న ప్రధాన మంత్రి దృష్టికోణం నుండి ప్రేరణ ను పొంది భారతీయ రేల్ దేశం లో రైలు మార్గాల ను సంపూర్ణం గా విద్యుతీకరించే దిశ లో ముందంజ వేస్తున్నది. ఈ ప్రక్రియ లో భాగం గా ప్రధాన మంత్రి ఉత్తరాఖండ్ లో సరిక్రొత్త గా విద్యుతీకరణ జరిగిన రైలు మార్గం భాగాల ను దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. దీనితో ఆ రాష్ట్రం లో అన్ని రైలు మార్గాలు 100 శాతం విద్యుతీకరణ పూర్తి అయినట్లేనన్న మాట. విద్యుతీకరణ జరిగిన సెక్శన్ లలో ఇలెక్ట్రిక్ ట్రాక్శన్ ద్వారా నడిచే రైళ్ళ వల్ల ఒక్క వేగంలో వృద్ధి యే కాకుండా, బరువు ను మోసుకు పోయే సామర్థ్యం సైతం పెరగనుంది.