ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020వ సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీ నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఒక భారీ పంపిణీ శిబిరం లో పాల్గొని, రాష్ట్రీయ వయోశ్రీ యోజన (ఆర్‌వివై) లో భాగం గా వయోవృద్ధు లకు సహాయక ఉపకరణాల ను, ఎడిఐపి పథకం లో భాగం గా దివ్యాంగ జనుల కు సహాయక ఉపకరణాల ను అందజేయనున్నారు.
లబ్ధిదారుల సంఖ్య పరం గాను, ప్రదానం చేస్తున్న ఉపకరణాల సంఖ్య పరంగాను మరియు సదరు సహాయక పరికరాల విలువ పరంగా ను చూసినప్పుడు ఇది దేశం లో నిర్వహించబోయేటటువంటి అతిపెద్ద పంపిణీ శిబిరం గా లెక్క కు రానుంది.
ఈ భారీ శిబిరం లో, 56,000కు పైగా సహాయక ఉపకరణాల ను మరియు సాధనాల ను 26,000 మంది కి పైగా లాభితుల కు ఉచితం గా ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ సహాయక పరికరాలు మరియు సాధనాల కు అయ్యే ఖర్చు 19 కోట్ల రూపాయల కు పైనే ఉంటుంది.
ఈ పరికరాలను మరియు ఉపకరణాల ను అందించడం ద్వారా వయోవృద్ధులు మరియు దివ్యాంగ జనుల సామాజిక-ఆర్థిక అభ్యున్నతి తో పాటు వారి దైనందిన జీవనాని కి కూడా తోడ్పాటు ను అందించాలి అన్నదే ఈ సహాయం యొక్క ధ్యేయం గా ఉంది.