ఉద్యోగాల లోకి క్రొత్త గా నియామకం అయిన వారికి సంబంధించిన సుమారు 51,000 నియామక లేఖల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 సెప్టెంబరు 26 వ తేదీ నాడు ఉదయం పూట పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా పంపిణీ చేయనున్నారు. నూతనం గా నియామకం జరిగిన వారిని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు కూడాను.
దేశవ్యాప్తం గా 46 ప్రాంతాల లో రోజ్ గార్ మేళా ను నిర్వహించడం జరుగుతుంది. కేంద్రప్రభుత్వ విభాగాల తో పాటు గా రోజ్ గార్ మేళా కు సమర్థన ను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల లో నియామకాలు చోటు చేసుకోనున్నాయి. దేశ వ్యాప్తం గా ఎంపిక అయిన, క్రొత్త గా నిమామకం జరిగినటువంటి వారు వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాల లో చేరనున్నారు. వారు చేరే కార్యాలయాలలో తపాలా విభాగం, ఇండియన్ ఆడిట్ & అకౌంట్స్ విభాగం, అణు శక్తి విభాగం, రెవిన్యూ విభాగం, ఉన్నత విద్య విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం విభాగం, తదితర కార్యాలయాలు ఉన్నాయి.
ఉద్యోగాల కల్పన కు అత్యున్నత ప్రాధాన్యాన్ని ఇచ్చే విషయం లో ప్రధాన మంత్రి వచన బద్ధత ను నెరవేర్చే దిశ లో రోజ్ గార్ మేళా ఒక అడుగు గా ఉంది. రోజ్ గార్ మేళా ఉద్యోగాల కల్పన ను పెంపొందింప జేయడం లో ఒక ఉత్ప్రేరకం వలె పనిచేయగలదన్న భావన ఉంది. అంతేకాక యువతీ యువకుల సశక్తీకరణ తో పాటు గా దేశాభివృద్ధి లో పాలుపంచుకోవడం లో సార్థకం కాగల అవకాశాల ను కూడా ఈ రోజ్ గార్ మేళా వారికి అందిస్తుందన్న భావన సైతం ఉంది.
క్రొత్త గా ఉద్యోగాల లో నియామకం జరిగిన వారు ‘కర్మయోగి ప్రారంభ్’ ద్వారా వారంతట వారు గా శిక్షణ ను పొందే అవకాశాన్ని కూడాను దక్కించుకోనున్నారు. ‘కర్మయోగి ప్రారంభ్’ అనేది ఐజిఒటి కర్మయోగి పోర్టల్ ( iGOT Karmayogi portal ) కు చెందిన ఒక ఆన్ లైన్ మాడ్యూల్. ఈ పోర్టల్ లో 680 కి పైగా ఇ-లర్నింగ్ పాఠ్యక్రమాల ను ‘ఎక్కడయినా ఏ డివైస్ నుండి అయినా’ నేర్చుకొనే ఫార్మేట్ లో అందుబాటు లో కి తీసుకు రావడమైంది.