మంగళప్రదమైన విజయ దశమి 2021 అక్టోబర్ 15 న ఏడు కొత్త రక్షణ కంపెనీల ను దేశ ప్రజల కు అంకితం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం సుమారు 12 గంటల 10 నిమిషాల కు ఈ కార్యక్రమం ఉంటుంది.
ఈ కార్యక్రమం లో రక్షణ మంత్రి, రక్షణ శాఖ సహాయ మంత్రి లతో పాటు రక్షణ పరిశ్రమ సంఘాల ప్రతినిధులు కూడా పాలుపంచుకొంటారు.
7 కొత్త రక్షణ కంపెనీల ను గురించి
దేశ రక్షణ సంబంధి సన్నద్ధత లో స్వయం సమృద్ధి ని మెరుగుపరచే చర్యల లో భాగం గా, ఆయుధ కర్మాగారాల సంబంధి బోర్డు ను ఒక ప్రభుత్వ విభాగం గా ఉన్నది కాస్తా 100 శాతం ప్రభుత్వ యాజమాన్యం కలిగిన కార్ పొరేట్ ఎన్ టిటి లు గా మార్చాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా మార్చడం వల్ల కార్యకలాపాల నిర్వహణ పరంగా స్వతంత్ర ప్రతిపత్తి, సామర్థ్యం అధికం కావడమే కాక వృద్ధి మరియు నూతన ఆవిష్కరణ లలో సరికొత్తదనం పెల్లుబుకగలదు.
కొత్త గా ఏర్పాటు చేసిన ఏడు రక్షణ కంపెనీలు ఏవేవంటే, అవి - మ్యూనిశన్స్ ఇండియా లిమిటెడ్ (ఎమ్ఐఎల్), ఆర్మర్ డ్ వీయికల్స్ నిగమ్ లిమిటెడ్ (ఎవిఎఎన్ఐ), అడ్వాన్స్ డ్ వెపన్స్ ఎండ్ ఇక్విప్ మెంట్ ఇండియా లిమిటెడ్ (ఎడబ్ల్యుఇ ఇండియా), ట్రూప్ కంఫర్ట్ స్ లిమిటెడ్ (టిసిఎల్), యంత్ర ఇండియా లిమిటెడ్ (వైఐఎల్), ఇండియా ఆప్ టెల్ లిమిటెడ్ (ఐఒఎల్), ఇంకా గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ (జిఐఎల్) లు.