ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 16న సాయంత్రం 4 గంటల వేళ లో వివాటెక్ అయిదో సంచిక ను ఉద్దేశించి కీలకోపన్యాసం ఇవ్వనున్నారు. వివా టెక్ 2021 కార్యక్రమం లో కీలకోపన్యాసం ఇవ్వడానికి ప్రధాన మంత్రి ని గౌరవ అతిథి గా ఆహ్వానించడమైంది.
ఈ కార్యక్రమం లో పాలుపంచుకొనే ఇతర ప్రముఖ వక్తల లో ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేనుయెల్ మేక్రోన్, స్పెయిన్ ప్రధాని శ్రీ పెడ్రో సాంచెజ్ లతో పాటు యూరోప్ లోని వివిధ దేశాల కు చెందిన మంత్రులు/ఎంపీ లు కూడా ఉన్నారు. ఏపల్ సిఇఒ శ్రీ టిమ్ కుక్, ఫేస్ బుక్ చైర్‌మన్ మరియు సిఇఒ శ్రీ మార్క్ జకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంటు శ్రీ బ్రాడ్ స్మిత్ తదితర కార్పొరేట్ నేత లు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొననున్నారు.
వివాటెక్ అనేది యూరోప్ లో జరిగే అతి పెద్దదైన డిజిటల్, స్టార్ట్ అప్ కార్యక్రమాల లో ఒకటి. 2016వ సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని ప్యారిస్ లో జరుపుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ మీడియా గ్రూపు లెస్ ఇకోస్ ప్రముఖ అడ్వర్‌టైజింగ్, మార్కెటింగ్ రంగం లోని ప్రముఖ సంస్థ అయిన పబ్లిసిస్ గ్రూప్ తో కలసి నిర్వహిస్తోంది. సాంకేతిక విజ్ఞాన రంగం లో, స్టార్ట్ అప్ ఇకో సిస్టమ్ లో భాగం పంచుకొంటున్న సంస్థల ను ఈ కార్యక్రమం ఒకే చోటు లో సమావేశపరుస్తోంది. ఈ కార్యక్రమం లో ప్రదర్శన లు, పురస్కారాలు, దళ చర్చ లు, స్టార్ట్ అప్ పోటీ లు భాగం గా ఉంటాయి. వివాటెక్ అయిదో సంచిక ను ఈ సంవత్సరం లో జూన్ నెల 16వ తేదీ నుంచి అదే నెల 19వ తేదీ మధ్య కాలం లో నిర్వహించనున్నారు.