ది ఎనర్జీ ఎండ్ రిసోర్సెస్ ఇన్ స్టిట్యూట్ (టిఇఆర్ఐ) నిర్వహించే వరల్డ్ సస్ టేనబుల్ డెవలప్ మెంట్ సమిట్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ న సాయంత్రం పూట సుమారు 6 గంటల వేళ కు వీడియో సందేశం ద్వారా ప్రారంభోపన్యాసాన్ని ఇవ్వనున్నారు.
వరల్డ్ సస్ టేనబుల్ డెవలప్ మెంట్ సమిట్ అనేది టిఇఆర్ఐ ప్రతి ఏటా నిర్వహించే ప్రముఖ కార్యక్రమం. ఈ సంవత్సరం లో జరిగే ఈ శిఖర సమ్మేళనం తాలూకు ఇతివృత్తం ఏమిటి అంటే అది ‘టువార్డ్ స్ ఎ రిజిలియంట్ ప్లానెట్: ఎన్ శువరింగ్ ఎ సస్ టేనబుల్ ఎండ్ ఈక్విటబుల్ ఫ్యూచర్’ అనేదే. జలవాయు పరివర్తన, నిలకడతనం తో కూడినటువంటి ఉత్పత్తి, శక్తి సంబంధి పరివర్తన లు, గ్లోబల్ కామన్స్ , రిసోర్స్ సిక్యూరిటి లు సహా అనేక అంశాల ను ఈ శిఖర సమ్మేళనం లో చర్చ జరుగనుంది.
ఫిబ్రవరి 16న మొదలయ్యే మూడు రోజుల శిఖర సమ్మేళనం లో డొమినికన్ రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ లూయీ ఎబీనేదర్, కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గయానా అధ్యక్షుడు డాక్టర్ శ్రీ మొహమ్మద్ ఇర్ ఫాన్ అలీ, ఐక్య రాజ్య సమితి డిప్యూటీ సెక్రటరి జనరల్ అమీనా జె మొహమ్మద్ లతో పాటు వివిధ అంతర్ ప్రభుత్వ సంస్థ ల అధిపతులు, 12 కు పైగా దేశాల మంత్రులు / రాయబారులు, దూత లు మరియు 120 కి పైగా దేశాల కు చెందిన ప్రతినిధులు పాలుపంచుకోనున్నారు.