PM to dedicate National Atomic Timescale and Bhartiya Nirdeshak Dravya to the Nation
PM to also lay Foundation Stone of National Environmental Standards Laboratory

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2021 జనవరి, 4వ తేదీన, జాతీయ మెట్రాలజీ సదస్సునుద్దేశించి, దృశ్యమాధ్యమం ద్వారా, ప్రారంభోపన్యాసం చేయనున్నారు.   ప్రధానమంత్రి, ఈ సందర్భంగా, ‘జాతీయ అటామిక్ టైమ్ స్కేల్’, మరియు ‘భారతీయ నిర్దేశక్ ద్రవ్య’ లను కూడా దేశానికి అంకితం చేయనున్నారు.  అదేవిధంగా, ‘జాతీయ పర్యావరణ ప్రమాణాల ప్రయోగశాల" కూడా, శ్రీ నరేంద్రమోదీ, శంకుస్థాపన చేయనున్నారు.  ఈ కార్యక్రమానికి, కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ కూడా హాజరుకానున్నారు.

జాతీయ అటామిక్ టైమ్ స్కేల్,  2.8 నానో సెకన్ల ఖచ్చితత్వంతో భారతీయ ప్రామాణిక సమయాన్ని సూచిస్తుంది.  భారతీయ నిర్దేశక్ ద్రవ్య అనేది, అంతర్జాతీయ ప్రమాణాలకు సమానంగా, నాణ్యతా భరోసా కోసం ప్రయోగశాలల పరీక్ష మరియు క్రమాంకనానికి మద్దతు ఇస్తుంది.  జాతీయ పర్యావరణ ప్రమాణాల ప్రయోగశాల – పరిసరాల్లో గాలి మరియు పారిశ్రామిక ఉద్గారాల పర్యవేక్షణ పరికరాల ధృవీకరణలో స్వావలంబనకు, సహాయపడుతుంది. 

ఈ సదస్సు గురించి : 

2021 – జాతీయ మెట్రాలజీ సదస్సు ను, న్యూఢిల్లీ లోని శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి – జాతీయ భౌతిక ప్రయోగశాల (సి.ఎస్.ఐ.ఆర్-ఎన్.‌పి.ఎల్) నిర్వహిస్తోంది. ఈ సంస్థ 74 సంవత్సరాలు పూర్తిచేసుకుని, 75వ సంవత్సరంలోకి ప్రవేశిస్తోంది.  ‘దేశ సమగ్ర వృద్ధికి మెట్రాలజీ’ అనే ఇతివృత్తంతో, ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
BrahMos and beyond: How UP is becoming India’s defence capital

Media Coverage

BrahMos and beyond: How UP is becoming India’s defence capital
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 డిసెంబర్ 2025
December 22, 2025

Aatmanirbhar Triumphs: PM Modi's Initiatives Driving India's Global Ascent