ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమిళ నాడు లో చమురు మరియు వాయు రంగం లో కొన్ని కీలకమైన పథకాల ను బుధవారం నాడు, అంటే ఈ నెల 17న, సాయంత్రం 4 గంటల 30 నిముషాల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు మరికొన్ని పథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్నారు. ప్రధాన మంత్రి రామనాథపురం - తూత్తుక్కుడి సహజవాయు గొట్టపు మార్గాన్ని, మణలీ లోని చెన్నై పెట్రోలియమ్ కార్పొరేశన్ లిమిటెడ్ కు చెందిన గ్యాసొలీన్ డీసల్ఫరైజేశన్ యూనిటు ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు. నాగపట్టినమ్ లో ఏర్పాటు కానున్న కావేరీ బేసిన్ రిఫైనరీ కి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ పథకాలతో చెప్పుకోదగ్గ సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు అందడమే కాకుండా దేశం ఊర్జా ఆత్మనిర్భరత దిశ లో పయనించే అవకాశాలు కూడా పెంపొందుతాయి. ఈ సందర్బం లో తమిళ నాడు గవర్నరు, తమిళ నాడు ముఖ్యమంత్రి లతో పాటు పెట్రోలియమ్, సహజ వాయువు శాఖ కేంద్ర మంత్రి కూడా పాల్గొంటారు.
ప్రాజెక్టులను గురించి
ఎణ్నూర్-తిరువళ్ళూర్-బెంగళూరు-పుదుచ్చేరీ-నాగపట్టినమ్-మధురై-తూత్తుక్కుడి సహజవాయువు గొట్టపు మార్గం లో ఒక భాగం గా ఉన్న రామనాథపురం-తూత్తుక్కుడి సెక్షను ను (143 కి.మీ.) దాదాపు 700 కోట్ల రూపాయల వ్యయం తో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒఎన్‌జిసి కి చెందిన వాయు క్షేత్రాల నుంచి వాయువు ను ఉపయోగించుకోవడానికి, పరిశ్రమల కు, ఇతర వాణిజ్య సరళి వినియోగదారుల కు ఫీడ్ స్టాక్ రూపం లో సహజవాయువు ను పంపిణీ చేయడానికి సాయపడనుంది.
మణలీ లోని చెన్నై పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్ (సిసిసిఎల్) లో గ్యాసొలీన్ డీసల్ఫరైజేశన్ యూనిటు ను సుమారు 500 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించడం జరిగింది. ఇది తక్కువ గంధకం (8 పిపిఎమ్ కన్నా తక్కువ) ఉండే పర్యావరణానికి హాని చేయనటువంటి గ్యాసొలీన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఉద్గారాల ను తగ్గించుకోవడం లో సాయపడుతుంది; స్వచ్ఛ పర్యావరణాన్ని పరిరక్షించే దిశ లో కూడాను తోడ్పాటు ను అందించనుంది.
నాగపట్టినమ్ లో ఏర్పాటు చేయనున్న కావేరీ బేసిన్ రిఫైనరీ సామర్థ్యం ఒక్కో సంవత్సరానికి 9 మిలియన్ మెట్రిక్ టన్నులు గా ఉంటుంది. దీనిని సిపిసిఎల్, ఐఒసిఎల్ ల సంయుక్త సంస్థ (జాయింట్ వెంచర్) మాధ్యమం ద్వారా రమారమి 31,500 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయం తో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది బిఎస్-VI ప్రత్యేక ప్రమాణాల కు అనుగుణం గా ఉండే మోటర్ స్పిరిట్ ను, డీజిల్ ను, విలువ ను జోడించిన ఉత్పాదన రూపం లో పాలీప్రొపైలీన్ ను కూడా ఉత్పత్తి చేస్తుంది