హరియాణా లోని పానీపత్ లో ఏర్పాటు చేసినటువంటి రెండో తరం (2జి) ఇథెనాల్ ప్లాంటు ను ప్రపంచ బయో ఫ్యూయల్ దినం సందర్భం లో, 2022వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీ నాడు సాయంత్రం పూట 4 గంటల 30 నిమిషాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు.
దేశం లో బయో ఫ్యూయల్స్ ఉత్పత్తి ని మరియు ఉపయోగాన్ని పెంచడం కోసం ప్రభుత్వం కొన్ని సంవత్సరాల తరబడి తీసుకొంటున్న అనేక చర్యల లో ఈ ప్లాంటు ను అంకితం చేయడం అనేది ఒక భాగం గా ఉంది. శక్తి రంగాన్ని మరింత తక్కువ ఖర్చు తో కూడినది గాను, అందరి కి అందుబాటులో ఉండేది గాను, వనరుల ను ఆదా చేసిది గాను మరియు స్థిరత్వం కలిగింది గాను మార్పు చేసే దిశ లో ప్రధాన మంత్రి చేస్తున్న నిరంతర ప్రయాసల కు అనుగుణం గా ఈ ప్లాంటు ఉంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ లిమిటెడ్ (ఐఒసిఎల్) ద్వారా 900 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో 2జి ఇథెనాల్ ప్లాంటు ను నిర్మించడం జరిగింది. ఈ ప్లాంటు ను పానీపత్ రిఫైనరీ కి సమీపం లో ఏర్పాటు చేయడమైంది. అత్యధునాతన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం ఆధారితం అయినటువంటి ఈ ప్రాజెక్టు ఏటా దాదాపు గా 2 లక్షల టన్నుల వరి దుబ్బు ను వినియోగించుకొంటూ సంవత్సరాని కి సుమారు గా 3 కోట్ల లీటర్ ల ఇథెనాల్ ను తయారు చేయడం ద్వారా వ్యర్థాల నుంచి సంపద ను సృష్టించాలి అనేటటువంటి భారతదేశం యొక్క కృషి లో ఒక కొత్త అధ్యాయాన్ని జోడించనుంది.
పంట అవశేషాల ను సంపూర్ణం గా వినియోగించుకోవడం అనేది రైతుల కు సాధికారిత ను కల్పించనుంది. అంతేకాకుండా, వారికి ఒక అదనపు ఆదాయార్జన మార్గాన్ని అందించనుంది. ఈ ప్రాజెక్టు ప్లాంటు నిర్వహణ లో పాల్గొనే వ్యక్తుల కు ప్రత్యక్ష ఉపాధి ని కల్పించడం తో పాటుగా వరి దుబ్బు ను నరికి వేయడం, దానిని నిలవ చేయడం మొదలైన పనుల లో తలమునక లు అయ్యే వారికి పరోక్ష ఉపాధి ని కూడా అందిస్తుంది.
ఈ ప్రాజెక్టు లో ద్రవ పదార్థాల విడుదల అంటూ ఏమీ ఉండదు. వరి గడ్డి పరకల ను మండించి వేయడాన్ని తగ్గించడం ద్వారా, ఈ ప్రాజెక్టు ఒక్కో సంవత్సరం లో దాదాపు గా మూడు లక్షల టన్నుల కు సమానమైనటువంటి బొగ్గు పులుసు వాయువు (కార్బన్ డయాక్సైడ్) కు సమానమైన గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో తగ్గింపునకు తోడ్పాటు ను అందించనుంది. అంటే అది దేశం లోని రహదారుల పై ఏటా సుమారు అరవై మూడు వేల కార్ల ను రీప్లేస్ చేయడం తో సమానం అని అర్థం చేసుకోవచ్చన్న మాట.