ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2023 మే నెల 25 వ తేదీ నాటి రాత్రి 7 గంటల కు ప్రారంభం అవుతున్నట్లు గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రకటించనున్నారు.
దేశం లో క్రీడల సంస్కృతి ని అభివృద్ధి పరచడం మరియు యువతీ యువకులు క్రీడల వైపు మొగ్గు చూపేటట్లు గా వారిని ప్రోత్సహించడం అనే అంశాల పై ప్రధాన మంత్రి ఎనలేని శ్రద్ధ ను తీసుకొన్నారు. దేశం లో క్రీడల సంబంధి వాతావరణాన్ని పటిష్ట పరచడం కోసం; అలాగే, ఔత్సాహిక క్రీడాకారుల కు సమర్థన ను ఇవ్వడం కోసం ప్రభుత్వం వివిధ పథకాల ను ప్రవేశ పెట్టింది. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ నిర్వహణ ఈ దిశ లో మరొక అడుగు అని చెప్పాలి.
ఈ సంవత్సరం లో, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స యొక్క మూడో సంచిక ను ఉత్తర్ ప్రదేశ్ లో మే నెల 25 వ తేదీ మొదలుకొని జూన్ 3 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల ను వారాణసీ, గోరఖ్ పుర్, లఖ్ నవూ, ఇంకా గౌతం బుద్ధ నగర్ లలో నిర్వహించనున్నారు. ఈ ఆటల లో రెండు వందల కు పైగా విశ్వవిద్యాలయాల నుండి 4750 మందికి పైచిలుకు క్రీడాకారులు పాలుపంచుకొని, 21 విధాలైన క్రీడల లో పోటీ పడనున్నారు. ఈ ఆటల ముగింపు కార్యక్రమం జూన్ 3 వ తేదీ నాడు వారాణసీ లో ఉంటుంది.
ఈ ఆటల మస్కట్ కు ‘జీతు’ అని పేరు పెట్టారు; అది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పశువు బారహ్ సీంఘా ఆకారం లో ఉంటుంది.