ఐసిటి ఆధారితమైన మల్టి-మోడల్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైంలీ ఇంప్లిమెంటేశన్ – పిఆర్ఎజిఎటిఐ- (‘ప్రగతి’) మాధ్యమం ద్వారా 2020వ సంవత్సరం జనవరి 22వ తేదీ న జరుగనున్న 32వ ముఖాముఖి సమీక్ష సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు.
గడచిన 31 ముఖాముఖిల లో 12 లక్షల కోట్ల రూపాయల కు పైగా విలువైన పథకాల ను ప్రధాన మంత్రి సమీక్షించారు. 2019వ సంవత్సరం లో కడపటి సారి జరిగిన ప్రగతి సమీక్ష సమావేశం లో 61,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన 16 రాష్ట్రాల కు మరియు కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము – కశ్మీర్ కు సంబంధించిన 9 పథకాలు చర్చ కు వచ్చాయి. విదేశాల లో పనిచేస్తున్న భారతీయ పౌరుల ఇక్కట్టు లు, జాతీయ వ్యవసాయ విపణి, మహత్త్వాకాంక్ష
కలిగిన జిల్లా ల సంబంధిత కార్యక్రమం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు వంటి వేరు వేరు అంశాల పైన కూడా చర్చించడమైంది.
బహుళ ప్రయోజనాల సాధన కు మల్టి-మోడల్ గవర్నెన్స్ ప్లాట్ ఫార్మ్ ‘పిఆర్ఎజిఎటిఐ’ (ప్రగతి) మాధ్యమాన్ని ప్రధాన మంత్రి 2015 మార్చి నెల 25వ తేదీ న ప్రారంభించారు. సామాన్యుడి ఇబ్బందుల ను పరిష్కరించడమే ధ్యేయం గా ఉద్దేశించిన సమీకృతమైనటువంటి మరియు ముఖాముఖి చర్చాత్మకమైనటువంటి వేదిక గా ‘ప్రగతి’ ఉంటున్నది. భారత ప్రభుత్వం యొక్క ముఖ్య కార్యక్రమాల ను, అలాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం కోరిన పథకాల ను ఏక కాలం లో పర్యవేక్షించేందుకు మరియు సమీక్షించేందుకు కూడా ప్రగతి సహాయకారి గా ఉంటున్నది.