భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని స్మరించుకుంటున్న ఈ అమృత సందర్భం గా రాష్ట్రాలు మరింత ఉత్సాహం, శక్తి, స్వయం సమృద్ధి, స్వావలంబన మరియు సహకార సమాఖ్య స్ఫూర్తితో ‘ఆత్మ నిర్భర్ భారత్’ వైపు పయనించాల్సిన అవసరం ఉంది. స్థిరమైన, నిలకడతో నిరంతరం కొనసాగే ప్రగతి కోసం, సమ్మిళిత భారతదేశాన్ని నిర్మించే దిశగా, నీతి ఆయోగ్ ఏడవ పాలక మండలి సమావేశం 7 ఆగస్టు 2022న నిర్వహించబడుతుంది. కేంద్రం మరియు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సహకారం మరియు సయోధ్య తో కొత్త శకం వైపు పయనంలో సమన్వయానికి మార్గం సుగమం చేస్తుంది.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ఏడవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. పంటల వైవిధ్యం, నూనెగింజలు, పప్పుధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తి దారుల సంఘాలలో స్వయం సమృద్ధిని సాధించడం; జాతీయ విద్యా విధానం-పాఠశాల విద్య అమలు; జాతీయ విద్యా విధానం-ఉన్నత విద్య అమలు; నగర పట్టణ సుపరిపాలన సమావేశం యొక్క చర్చనీయాంశాలు.
ఈ సమావేశ సన్నాహాల్లో భాగంగా ఆరు నెలల పాటు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య కసరత్తు మేధోమథనం జరిగింది. తదనంతరం జూన్ 2022లో ధర్మశాలలో జరిగిన జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 7వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం పైన పేర్కొన్న ప్రతి అంశం పై కార్యాచరణ మార్గం వ్యూహం ఫలితాల ఆధారిత కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడానికి వివేచిస్తుంది.
జూలై 2019 తర్వాత గవర్నింగ్ కౌన్సిల్‌లో ఇది మొదటి ప్రత్యక్ష హాజరు సమావేశం. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అలాగే వచ్చే ఏడాది భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకమైన జీ (G) 20 సమిట్ కి అతిదేయ అద్యక్ష దేశంగా సమావేశాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో మనం అమృత్‌కాలం లోకి ప్రవేశించడం చాలా కీలకమైన సందర్భం. భారతదేశ సమాఖ్య వ్యవస్థ కు ఈ సమావేశ అధ్యక్ష గౌరవం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. G-20 సమావేశ వేదిక పై రాష్ట్రాలు తమ పురోగతిని ప్రదర్శించుకునే అవకాశం, అలాగే పోషించగల పాత్రపై కూడా ఈ సమావేశం చర్చిస్తుంది.
నీతి ఆయోగ్ పాలక మండలి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఉత్సాహం, చురుకు, చొరవల భాగస్వామ్య దృక్పధం తో జాతీయ ప్రాధాన్యతలు, లక్ష్యాలు వ్యూహాలను రూపొందించడం కోసం స్థాపింబడిన ప్రధాన సంస్థ. పాలక మండలి వివిధ రంగాల, విభిన్న మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం, అంతర్ రాష్ట్ర సమస్యలను చర్చించడానికి ఒక వేదిక గా నిలుస్తుంది. భారతదేశ ప్రధాన మంత్రి; రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత లెఫ్టినెంట్ గవర్నర్లు; నీతి ఆయోగ్ ఎక్స్-అఫీషియో సభ్యులు; వైస్ చైర్మన్, నీతి ఆయోగ్; పూర్తి సమయం సభ్యులు, కేంద్ర మంత్రులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. నీతి అయోగ్ సమ్మిళిత అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్రాల మధ్య పలు అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల రూపకల్పన వంటి పలు అంశాలపై సమన్వయంతో ప్రగతి సాధన కోసం కీలక వ్యూహాలను రూపొందించడానికి చర్చలకు అత్యంత ముఖ్యమైన వేదిక గా నిలుస్తుంది.
Would be chairing the 7th Governing Council meet of @NITIAayog tomorrow, 7th August. This forum provides a great opportunity for the Centre and states to exchange views on key policy related issues and strengthen India’s growth trajectory. https://t.co/BOVn9gZIjd
— Narendra Modi (@narendramodi) August 6, 2022