ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, నవంబర్ 21వ తేదీన గాంధీనగర్ లోని పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం 8 వ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు. ఈ స్నాతకోత్సవంలో సుమారు 2,600 మంది విద్యార్థులు తమ డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికెట్లను అందుకుంటారు.
ఈ సందర్భంగా, ‘మోనోక్రిస్టల్ లైన్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్యానెల్ కు చెందిన 45 మెగావాట్ల ఉత్పత్తి కర్మాగారం’ మరియు ‘వాటర్ టెక్నాలజీ పై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ’కు శంకుస్థాపన చేస్తారు. పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయంలో ‘ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ – టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్’, ‘ట్రాన్స్‌లేషనల్ రీసెర్చ్ సెంటర్’, ‘స్పోర్ట్స్ కాంప్లెక్స్ ’లను కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రారంభిస్తారు.