ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న న్యూ ఢిల్లీ లోని కరియప్ప పరేడ్ గ్రౌండ్ లో జరిగే నేశనల్ కేడెట్ కోర్ (ఎన్‌సిసి) ర్యాలీ కి హాజరు కానున్నారు.
ఈ కార్యక్రమం లో భాగం గా గౌరవ వందనాన్ని ప్రధాన మంత్రి పరిశీలిస్తారు. వివిధ ఎన్‌సిసి దళాల కవాతు ను కూడా ఆయన వీక్షిస్తారు. ఎన్‌సిసి సైనిక విద్యార్థులు ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని సమర్పించడం తో పాటు కళ లు, సంగీతం మరియు సాహసిక క్రీడల వంటి రంగాల లో తమ తమ ప్రతిభ ను ప్రధాని సమక్షం లో ఆవిష్కరిస్తారు.
ప్రధాన మంత్రి ప్రతిభావంతులైన ఎన్‌సిసి సైనిక విద్యార్థుల కు పురస్కారాల ను కూడా ప్రదానం చేస్తారు. ఆ తరువాత సభికుల ను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
గణతంత్ర దిన శిబిరం లో పాలుపంచుకోవడం కోసం ప్రతి సంవత్సరం వందలాది పెద్ద సంఖ్య లో ఎన్‌సిసి సైనిక విద్యార్థులు న్యూ ఢిల్లీ కి వచ్చి, ఇక్కడ ఏర్పాటు చేసే విశిష్ట శిబిరం లో బస చేస్తారు. గడచిన సంవత్సరం లో ఎన్‌సిసి ర్యాలీ ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ప్రకృతి విపత్తు ల వేళల్లో రక్షణ మరియు సహాయక కార్యకలాపాలను చేపట్టడం లో, అలాగే స్వచ్ఛ్ భారత్ అభియాన్ వంటి కార్యక్రమాల కు దన్ను గా నిలవడం లో వారి కృషి ని అభినందించారు.