PM Modi flags off Indian Railways’ first #MakeInIndia 12,000 HP electric locomotive in Bihar’s Madhepura district
I am glad that the people of Bihar have shown the spirit of oneness for the Swachhta campaign, says the PM Modi
We are taking forward Mahatma Gandhi's ideals through Swachhagraha movement: PM Modi
In the last one week, more than 8,50,000 toilets have been constructed in Bihar, this is a great achievement: PM Modi in Motihari
Villages built along the Ganga coast are being freed from open defecation on a priority basis: PM
The demand for LPG has risen because of the emphasis on clean fuel and the success of the #UjjwalaYojana : PM Modi
By building a toilet, a woman has found respect and safety & health parameters have also shown a marked increase: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మోతీహారీ లో జ‌రిగిన స్వ‌చ్ఛాగ్ర‌హుల జాతీయ స‌మ్మేళ‌నాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌హాత్మ గాంధీ నాయ‌క‌త్వంలో చంపార‌ణ్ లో జ‌రిగిన స‌త్యాగ్ర‌హం తాలూకు శ‌తాబ్ది ఉత్స‌వాల‌లో భాగంగా ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా, ప్ర‌ధాన మంత్రి ప‌లు ముఖ్య‌మైన అభివృద్ధి ప‌థ‌కాల‌ను కూడా ప్రారంభించారు. నీటి స‌ర‌ఫ‌రా మ‌రియు పారిశుధ్య రంగంలో మోతీఝీల్ ప‌థ‌కం, బెట్టియా న‌గ‌ర్ ప‌రిష‌త్ నీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కం తో పాటు నాలుగు గంగా ప‌థ‌కాల‌కు చెందిన శంకుస్థాప‌న ఫ‌ల‌కాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు. ఆ నాలుగు గంగా ప‌థ‌కాలు: పట్నా లోని స‌యీద్‌పుర్ స్యూయిజ్ నెట్‌వ‌ర్క్‌, ప‌ట్నా; ప‌ట్నా లోనే 4వ జోన్‌ యొక్క ప‌హాడీ స్యూయిజ్ నెట్‌వ‌ర్క్‌, ప‌ట్నా లోనే 5వ జోన్ లో ప‌హాడీ స్యూయిజ్ నెట్ వ‌ర్క్ ఇంకా ప‌హాడీ ఎస్‌టిపి ప‌థ‌కం.

రైల్వేల రంగంలో ముజ‌ఫ‌ర్‌పుర్ మ‌రియు సాగౌలీ తో పాటు సాగౌలి- వాల్మీకి న‌గ‌ర్ ల మ‌ధ్య రైలు మార్గం డ‌బ్లింగ్ ప‌నుల‌కు ప్ర‌ధాన మంత్రి శంకుస్థాప‌న చేశారు. ఆయన మాధేపుర ఎల‌క్ట్రిక్ లోకోమోటివ్ ఫ్యాక్ట‌రీ ఒక‌టో ద‌శ‌ను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. ఆయన ప్రప్రథమ 12000 హెచ్‌పి ఫ్రైట్ ఎల‌క్ట్రిక్ లోకోమోటివ్ కు మ‌రియు చంపార‌ణ్ హ‌ంస‌ఫ‌ర్ ఎక్స్‌ప్రెస్‌ కుప్రారంభ సూచక ప‌చ్చ జెండా ను – వీడియో లింక్ ద్వారా- చూపారు.

అదే విధంగా ఔరంగాబాద్‌, బిహార్ – ఝార్ ఖండ్ బార్డ‌ర్ సెక్ష‌న్ లోని ఎన్‌హెచ్ -2 కు చెందిన ఒక రోడ్ లేన్ కు, మోతీహారీ లో ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ కు చెందిన ఒక పెట్రోలియ‌మ్ ఆయిల్ ల్యూబ్ మ‌రియు ఎల్‌పిజి ట‌ర్మిన‌ల్ కు; ఇంకా సాగౌలీ లో హెచ్‌పిసిఎల్ యొక్క ఎల్‌పిజి ప్లాంటు ప‌నులకు పునాది రాళ్ళ‌నుప్ర‌ధాన మంత్రి వేశారు.

విజేత‌లుగా నిలిచిన స్వ‌చ్ఛాగ్ర‌హుల‌కు ఆయ‌న పుర‌స్కారాల‌ను కూడా ప్ర‌దానం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఉత్సాహంగా పాలుపంచుకొన్న స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ఇవాళ మోతీహారీ లో నెల‌కొన్న వాతావ‌ర‌ణం ఒక శతాబ్దం క్రితం చంపార‌ణ్ స‌త్యాగ్ర‌హం ఆరంభ‌మైన‌ప్ప‌టి స్ఫూర్తిని ప్ర‌తిబింబిస్తోంద‌ంటూ అభివ‌ర్ణించారు.

స‌త్యాగ్ర‌హం నుండి స్వ‌చ్ఛాగ్ర‌హం దిశ‌గా సాగిన ఈ యాత్ర‌లో బిహార్ ప్ర‌జ‌లు ఈ యాత్ర‌కు ముందు నిల‌బ‌డి నాయ‌కత్వం వ‌హించ‌డానికి త‌మ‌లో వున్నటువంటి సామ‌ర్ధ్యాన్ని చాటిచెప్పార‌ని ఆయన అన్నారు. గ‌త వారం రోజులుగా బిహార్ లో మ‌రుగుదొడ్ల నిర్మాణ క్ర‌మంలో అసాధార‌ణ‌మైన పురోగ‌తి చోటు చేసుకొంద‌ని ఆయ‌న వివ‌రించారు. ఇందుకుగాను రాష్ట్ర ప్ర‌జలు మ‌రియు రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన కృషిని ఆయ‌న అభినందించారు.

అది స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ కానివ్వండి, లేదా అవినీతిపై పోరాటం కానివ్వండి, లేదా పౌర స‌దుపాయాల‌ను అభివృద్ధి చేయ‌డం కానివ్వండి.. రాష్ట్ర ప్ర‌భుత్వంతో కేంద్ర‌ ప్ర‌భుత్వం భుజం భుజం క‌లిపి ప‌ని చేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. నేడు 6600 కోట్ల రూపాయ‌ల‌కు పైగా విలువైన ప‌థ‌కాలు ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని, ఇవి ఈ ప్రాంతంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు ఎంత‌గానో తోడ్ప‌డుతాయ‌ని ఆయ‌న తెలిపారు. మోతీఝీల్ ప్రాజెక్టు పున‌ర్ న‌వీక‌ర‌ణ మోతీహారీ చ‌రిత్రలో ఒక భాగం అవుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇంత‌వ‌ర‌కు గంగాన‌ది లో క‌లుస్తున్న వ్య‌ర్థ జ‌లాల‌ను నిరోధించ‌డం కోసం 3000 కోట్ల రూపాయ‌ల‌కు పైగా విలువైన 11 ప‌థ‌కాల‌కు ఆమోదం తెల‌ప‌డం జ‌రిగింద‌ని ఆయ‌న ప్ర‌స్తావించారు. బిహార్ రాష్ట్రంలో ఉజ్జ్వ‌ల యోజ‌న ద్వారా దాదాపు 50 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు ఎల్‌పిజి క‌నెక్ష‌న్ ల ప్ర‌యోజ‌నాన్ని అందుకొన్నట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంలో నేడు శ్రీ‌కారం చుట్టిన ఎల్‌పిజి మ‌రియు పెట్రోలియ‌మ్ ప్రోజెక్టుల‌ను గురించి కూడా ఆయ‌న త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. నేడు ప్రారంభించిన ప‌థ‌కాలు తూర్పు భార‌తావ‌నిని భార‌త‌దేశానికి ఒక చోద‌క శ‌క్తిగా అభివృద్ధి చేసే ఒక విశాల‌మైన దార్శ‌నిక‌త‌లో ఒక భాగం అని ఆయ‌న పేర్కొన్నారు. నేడు మొద‌లుపెట్టిన ర‌హ‌దారి పథకాలు మరియు రైలు ప‌థ‌కాల‌ను గురించి కూడా ఆయ‌న తెలియ‌జేశారు. మాధేపుర ఎల‌క్ట్రిక్‌ లోకోమోటివ్ ఫ్యాక్ట‌రీ ని ‘మేక్ ఇన్ ఇండియా’ లో ఒక ప్ర‌ముఖ‌మైన ఉదాహ‌ర‌ణ‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఇది ఈ ప్రాంతంలో ఒక ఉపాధి వ‌న‌రు కాగ‌ల‌ద‌ని చెప్పారు. ఈ రోజు బ‌య‌ట‌కు వ‌చ్చిన 12000 అశ్విక శ‌క్తి క‌లిగిన‌టువంటి ఇంజ‌ిన్ లు స‌ర‌కు ర‌వాణా రైళ్ళ యొక్క వేగాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో గ‌ణ‌నీయంగా తోడ్ప‌డుతాయ‌ని ఆయ‌న వివ‌రించారు. ఈ ప‌థ‌కానికి సంబంధించిన ప‌నుల‌కు మొట్ట‌మొద‌ట 2007వ సంవ‌త్స‌రంలో ఆమోదం ల‌భించిన‌ప్ప‌టికీ వాస్త‌వంగా ప‌నులు మూడేళ్ళ క్రితమే ఆరంభం అయ్యాయ‌ని, మ‌రి, ఒక‌టో ద‌శ‌ను ఇప్ప‌టికే పూర్తి చేయ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ప్ర‌జ‌ల అండ‌తో కేంద్ర ప్ర‌భుత్వం త‌న అన్ని సంక‌ల్పాల‌ను మ‌రియు ఉద్య‌మాల‌ను సాకారం చేయ‌డానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆయ‌న అన్నారు.

పారిశుధ్య రంగంలో సాధించిన విజ‌యాల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి త‌మ ప్ర‌సంగంలో ప్ర‌స్తావిస్తూ, 2014వ సంవ‌త్స‌రంలో సుమారు 40 శాతం మేర విస్త‌రించిన‌టువంటి పారిశుధ్య స‌దుపాయాలు నేడు సుమారు 80 శాతానికి చేరుకొన్నాయ‌ని తెలిపారు. మ‌రుగుదొడ్ల నిర్మాణం సామాజిక అస‌మాన‌త‌ల‌కు స్వస్తి ప‌లుకుతోంద‌ని, అంతేకాకుండా సామాజిక, ఆర్థిక స‌శ‌క్తీక‌ర‌ణ‌తో పాటు మ‌హిళ‌ల సాధికారిత‌ కు బాట వేస్తోంద‌ని పేర్కొన్నారు. స్వ‌చ్ఛ‌భార‌త్ అభియాన్ పేరిట సాగుతున్న ప్ర‌జా ఉద్య‌మం 21వ శ‌తాబ్దంలో ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా సాటిలేన‌టువంటి ఒక ప‌రిణామంగా రూపుదిద్దుకొంద‌ని ఆయ‌న వ‌ర్ణించారు.

స్వ‌చ్ఛ‌త కోసం తీసుకొన్న సంక‌ల్పం ఒక ప‌రిశుభ్ర‌మైనటువంటి మ‌రియు స‌మృద్ధ‌మైన‌టు వంటి భార‌త‌దేశం తాలూకు నూత‌న అధ్యాయాన్ని లిఖించగలద‌న్న విశ్వాసాన్ని ప్ర‌ధాన మంత్రి వ్య‌క్తం చేశారు.

Click here to read PM's speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”