రాజస్థాన్ లో 17,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటుగా శంకుస్థాపనల నుచేయనున్న ప్రధాన మంత్రి
ఈ ప్రాజెక్టు లు రహదారులు, రైలు మార్గాలు, సౌర శక్తి, విద్యుత్తుప్రసారం, త్రాగునీరు మరియుపెట్రోలియమ్, ఇంకా ప్రాకృతిక వాయువుల వంటి ముఖ్య రంగాల అవసరాల ను తీర్చుతాయి
రాజస్థాన్ లో మౌలిక సదుపాయాల రూపు రేఖల ను గణనీయం గాపరివర్తన చెందింప చేయడం మరియు వృద్ధి, ఇంకా అభివృద్ధి సంబంధి అవకాశాల ను కల్పించడం కోసం ప్రధాన మంత్రి చేస్తున్నఅలుపెరుగని ప్రయత్నాల ను ఈ ప్రాజెక్టు ల ప్రారంభోత్సవం సూచిస్తున్నది

వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2024 ఫిబ్రవరి 16 వ తేదీ నాడు ఉదయం పూట 11 గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా 17,000 కోట్ల రూపాయల కు పైగా వ్యయమయ్యే అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, దేశ ప్రజల కు ఆ ప్రాజెక్టుల ను అంకితం చేయడంల తో పాటు ఆ ప్రాజెక్టుల కు శంకుస్థాపన లు కూడా చేయనున్నారు. ఈ ప్రాజెక్టు లు రహదారులు, రైలు మార్గాలు, సౌర శక్తి, విద్యుత్తు ప్రసారం, త్రాగునీరు మరియు పెట్రోలియమ్, ఇంకా ప్రాకృతిక వాయువు లు సహా అనేక మహత్వపూర్ణ రంగాల అవసరాల ను తీర్చుతాయి.

 

 

ప్రధాన మంత్రి రాజస్థాన్ లో 5000 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు అయ్యే వివిధ జాతీయ రాజమార్గ సంబంధి ప్రాజెక్టుల ను ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి ఎనిమిది దోవ ల దిల్లీ-ముంబయి గ్రీన్ ఫీల్డ్ అలైన్‌మెంట్ (ఎన్ఇ-4) తాలూకు మూడు ప్యాకేజీల ను ప్రారంభించనున్నారు. ఆ మూడు ప్యాకేజీల లోను బౌలీ- ఝాలాయి రోడ్డు నుండి ముయీ గ్రామం సెక్శను, హర్‌దేవ్ గంజ్ గ్రామం నుండి మేజ్ నది సెక్శను మరియు తాక్‌లీ నుండి రాజస్థాన్/మధ్య ప్రదేశ్ సరిహద్దు వరకు ఉన్న సెక్శను లు ఉన్నాయి. ఈ సెక్శను లు ఆ ప్రాంతం లో వేగవంతమైనటువంటి మరియు మెరుగైనటువంటి సంధానాన్ని సమ కూర్చనున్నాయి. ఈ సెక్శను లు వన్యప్రాణుల కు ఎటువంటి ఆటంకం ఎదురుకానటువంటి విధం గా వాటి సంచారానికి అనువైన రీతిన ఏనిమల్ అండర్ పాస్ మరియు ఏనిమల్ ఓవర్ పాస్ లను ఏర్పాటు చేయడమైంది. వీటికి అదనం గా, వన్యప్రాణుల పై ధ్వని ప్రభావం అతి తక్కువ గా ఉండేందుకు తగిన ఏర్పాటు ను చేయడం జరిగింది. ప్రధాన మంత్రి కాయా గ్రమం లో ఎన్‌హెచ్-48 లోని దక్షిణ్ పుర్- శామ్‌లాజీ సెక్శను తో పాటు దేబారీ లో ఎన్‌హెచ్-48 లోని చిత్తౌడ్‌గఢ్ -ఉదయ్‌పుర్ హైవే సెక్శను ను కలిపే ఆరు దోవల తో ఉండే గ్రీన్ ఫీల్డ్ ఉదయ్‌పుర్ బైపాస్ ను కూడా ప్రారంభించనున్నారు. ఈ బైపాస్ ఉదయ్‌పుర్ సిటీ లో వాహనాల రోకపోకల రద్దీ ని తగ్గించడం లో సాయపడనుంది. రాజస్థాన్ లో ఝుంఝునూ, ఆబూ రోడ్డు మరియు టోంక్ జిల్లా లో రహదారి సంబంధి మౌలిక సదుపాయల ను మెరుగు పరచేటటువంటి అనేక ఇతర ప్రాజెక్టుల ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.

 

రాజస్థాన్ లో రైలు మార్గాల సంబంధి మౌలిక సదుపాయాల ను పటిష్ట పరుస్తూ రమారమి 2300 కోట్ల రూపాయల విలువైన ఎనిమిది ప్రధాన రైల్ వే ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు శంకుస్థాపన చేయనున్నారు. దేశ ప్రజల కు అంకితం చేసే రైల్ వే ప్రాజెక్టుల లో జోధ్‌పుర్-రాయ్ కా బాగ్-మెడ్ తా రోడ్డు- బీకానేర్ సెక్శను (277 కి.మీ.), జోధ్‌పుర్-ఫలోది సెక్శను (136 కి.మీ.), బీకానేర్-రతన్‌గఢ్-సాదుల్‌ పుర్-రేవాడీ సెక్శను (375 కి.మీ.) లు సహా రైలు మార్గాల యొక్క విద్యుతీకరణ కు ఉద్దేశించిన వేరు వేరు ప్రాజెక్టులు భాగం గా ఉన్నాయి. ప్రధాన మంత్రి ‘ఖాతీపురా రేల్ వే స్టేశను’ ను కూడా దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఈ రేల్ వే స్టేశను ను జయ్ పుర్ ను దృష్టిలో పెట్టుకొని ఒక శాటిలైట్ స్టేశను మాదిరి గా అభివృద్ధి పరచడమైంది. ఈ స్టేశను లో రైళ్ళు వాటి ప్రస్థానాన్ని మొదలు పెట్టడాని కి మరియు సమాప్తి చేయడాని కి వీలు గా ‘టర్మినల్ సదుపాయం’ ను జత పరచడమైంది. ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్న రైలు ప్రాజెక్టుల లో భగత్ కీ కోఠీ (జోధ్ పుర్ ) లో వందే భారత్ స్లీపర్ రైళ్ళ కు ఉద్దేశించిన నిర్వహణ కేంద్రం, ఖాతీపురా (జయ్‌పుర్) లో వందే భారత్, ఎల్‌హెచ్‌బి మొదలైన రేక్ ల రకాలు అన్నింటి నిర్వహణ, హనుమాన్ గఢ్ లో రైళ్ళ నిర్వహణ కు ఉద్దేశించిన కోచ్ కేయర్ కాంప్లెక్స్ యొక్క నిర్మాణం తో పాటు బాందీకుయీ నుండి ఆగ్ రా ఫోర్ట్ రైలు మార్గం యొక్క డబ్లింగ్ పని వంటివి ఉన్నాయి. రేల్ వే రంగం లో మౌలిక సదుపాయాల ను ఆధునికీకరించడం, భద్రత ఏర్పాటుల ను పెంచడం, కనెక్టివిటీ ని మెరుగు పరచడం తో పాటు సరకుల రవాణా ను మరియు ప్రజల రాకపోకల ను మరింత సమర్థవంతం గా తీర్చిదిద్దడం ఈ రేల్ వే రంగ ప్రాజెక్టు ల ధ్యేయం గా ఉంది.

 

రాజస్థాన్ లో నవీకరణ యోగ్య శక్తి ఉత్పాదన కు అదనపు హంగు ను సంతరించడం లో భాగం గా సుమారు 5,300 కోట్ల రూపాయల వ్యయం అయ్యేటటువంటి ప్రధానమైన సోలర్ ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వాటిని దేశ ప్రజల కు ఆయన అంకితం చేయనున్నారు. రాజస్థాన్ లోని బీకానేర్ జిల్లా లో గల బర్‌ సింగ్‌ సర్ థర్మల్ పవర్ స్టేశను కు చుట్టుప్రక్కల ఏర్పాటు చేయబోయే 300 మెగా వాట్ సామర్థ్యం కలిగి ఉండే సోలర్ పవర్ ప్రాజెక్టు అయినటువంటి ‘ఎన్ఎల్‌సిఐఎల్ బర్‌ సింగ్‌ సర్ సోలర్ ప్రాజెక్టు’ కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సోలర్ ప్రాజెక్టు ను ఆత్మనిర్భర్ భారత్ ఆశయాని కి అనుగుణం గా భారతదేశం లో తయారు చేసినటువంటి ఉన్నత సామర్థ్యం తో కూడిన బైఫేసియల్ మాడ్యూల్స్ సహిత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అండదండల తో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధాన మంత్రి కేంద్ర సార్వజనిక రంగ సంస్థ (సిపిఎస్ యు) ఫేజ్-II (ట్రాన్శ్ -III) లో భాగం గా ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్ యొక్క 300 ఎమ్‌డబ్ల్యు సోలర్ పవర్ ప్రాజెక్టు కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. దీనిని రాజస్థాన్ లోని బీకానెర్ లోనే అభివృద్ధిపరచడం జరుగుతుంది. రాజస్థాన్ లోని బీకానేర్ లో అభివృద్ధిపరచినటువంటి 300 ఎమ్‌డబ్ల్యు సామర్థ్యాన్ని కలిగివుండేటటువంటి ఎన్‌టిపిసి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ యొక్క నోఖ్ రా సోలర్ పివి ప్రాజెక్టు ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. ఈ సౌర శక్తి సంబంధి ప్రాజెక్టు లు కాలుష్యాని కి తావు ఉండనటువంటి విధం గా విద్యుత్తు ను ఉత్పత్తి చేస్తాయి. వీటి ద్వారా కార్బన్‌డై‌ఆక్సైడ్ ఉద్గార సమస్య సమసి పోనుంది. అంతేకాకుండా, ఆ ప్రాంతం లో ఆర్థికాభివృద్ధి కి ఈ ప్రాజెక్టు లు దోహదపడతాయి.

 

 

ప్రధాన మంత్రి రాజస్థాన్ లో 2100 కోట్ల రూపాయల కు పైగా విలువైన విద్యుత్తు ప్రసార రంగ సంబంధి ప్రాజెక్టుల ను సైతం దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు లు రాజస్థాన్ లో సోలర్ ఎనర్జీ జోన్ ల నుండి విద్యుత్తు తరలింపున కు ఉద్దేశించినవి. ఇక్కడ ఉత్పత్తి అయిన సౌర విద్యుత్తు ను లబ్ధిదారు సంస్థల కు ప్రసారం చేసేందుకు వీలు ఉంటుంది. ఈ ప్రాజెక్టుల లో ఫేజ్-II పార్ట్-ఎ లో భాగం గా రాజస్థాన్ లో సోలర్ ఎనర్జీ జోన్ ల నుండి (8.1 జిడబ్ల్యు) విద్యుత్తు ను తరలించడాని కి ఉద్దేశించిన ట్రాన్స్‌మిశన్ సిస్టమ్ సుదృఢీకరణ పథకం, ఫేజ్-II పార్ట్-బి1 లో భాగం గా రాజస్థాన్ లోని సోలర్ ఎనర్జీ జోన్ ల నుండి (8.1 జిడబ్ల్యు) సామర్థ్యం కలిగిన విద్యుత్తు ను తరలించడాని కి ఉద్దేశించిన ట్రాన్స్‌మిశన్ సిస్టమ్ సుదృఢీకరణ పథకం మరియు బీకానెర్ (పిజి), ఫతేహ్‌ గడ్ –II, ఇంకా భాద్‌లా-II లలో గల ఆర్ఇ ప్రాజెక్టుల కు కనెక్టివిటీ ని సమకూర్చేటటువంటి ట్రాన్స్‌మిశన్ సిస్టమ్ లు భాగం గా ఉన్నాయి.

 

జల్ జీవన్ మిశన్ లో భాగం గా చేపట్టే ప్రాజెక్టుల లో భాగం గా సుమారు 2400 కోట్ల రూపాయల వ్యయం అయ్యే అనేక ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ల ఉద్దేశ్యం రాజస్థాన్ లో స్వచ్ఛమైన త్రాగునీటి ని సమకూర్చడం కోసం తత్సంబంధి మౌలిక సదుపాయాల ను పటిష్టం చేయడం. ఈ ప్రాజెక్టు లు దేశ వ్యాప్తం గా కుటుంబాల కు నల్లా కనెక్శన్ మాధ్యం ద్వారా స్వచ్ఛమైన త్రాగునీటి ని అందించాలన్న ప్రధాన మంత్రి అంకితభావాన్ని ఈ చాటిచెబుతాయి.

 

 

జోధ్‌పుర్ లో ఇండియన్ ఆయిల్ యొక్క ఎల్‌పిజి బాట్లింగ్ ప్లాంటు ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. ఈ ప్లాంటు ను అత్యాధునికమైన మౌలిక సదుపాయాలు మరియు నిర్వహణపరం గా, భద్రత పరం గా పక్కాగా ఉండే స్వయంచాలక యంత్ర వ్యవస్థ తో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆ ప్రాంతం లో ఉపాధి అవకాశాల కల్పన కు బాట ను పరచడం తో పాటు గా లక్షల కొద్దీ వినియోగదారుల కు ఎల్‌పిజి అవసరాల ను కూడా తీర్చుతుంది.

 

రాజస్థాన్ లో ఈ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవం ఆ ప్రాంతం లో మౌలిక సదుపాయాల స్వరూపాన్ని మార్చివేయడం కోసం మరియు వృద్ధి కి అవకాశాల ను కల్పించడం కోసం ప్రధాన మంత్రి చేస్తున్న ఎడతెగని ప్రయాసల కు సూచిక గా నిలుస్తున్నది.

 

 

ఈ కార్యక్రమాన్ని రాజస్థాన్ లోని అన్ని జిల్లాల లోనూ దాదాపు గా 200 స్థానాల లో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య కార్యక్రమం జయ్ పుర్ లో ఉంటుంది. రాష్ట్రం అంతటా అమలయ్యే ఈ కార్యక్రమం లో ప్రభుత్వ వివిధ పథకాల కు చెందిన లక్షల కొద్దీ లబ్ధిదారులు పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమం లో రాజస్థాన్ ముఖ్యమంత్రి, రాజస్థాన్ ప్రభుత్వం లోని ఇతర మంత్రులు, ఎంపి లు, ఎమ్ఎల్ఎ లు మరియు స్థానిక ప్రతినిధులు కూడా పాల్గొంటారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi meets Prime Minister of Saint Lucia
November 22, 2024

On the sidelines of the Second India-CARICOM Summit, Prime Minister Shri Narendra Modi held productive discussions on 20 November with the Prime Minister of Saint Lucia, H.E. Mr. Philip J. Pierre.

The leaders discussed bilateral cooperation in a range of issues including capacity building, education, health, renewable energy, cricket and yoga. PM Pierre appreciated Prime Minister’s seven point plan to strengthen India- CARICOM partnership.

Both leaders highlighted the importance of collaboration in addressing the challenges posed by climate change, with a particular focus on strengthening disaster management capacities and resilience in small island nations.