Quoteఛత్తీస్‌గఢ్ లో 34,400 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి పథకాల ను ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు శంకుస్థాపన కూడా జరపనున్న ప్రధాన మంత్రి
Quoteఈ ప్రాజెక్టులురహదారులు, రైలు మార్గాలు, బొగ్గు, విద్యుత్తు మరియుసౌర శక్తి ల వంటి ముఖ్య రంగాల కు చెందినవి
Quoteఎన్‌టిపిసి కిచెందిన లారా సుపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు యొక్క ఒకటో దశ ను దేశ ప్రజల కు అంకితంచేయనున్న ప్రధాన మంత్రి; ఎన్‌టిపిసి కే చెందిన లారా సుపర్థర్మల్ పవర్ ప్రాజెక్టు యొక్క రెండో దశ కు ఆయన శంకుస్థాపన చేస్తారు

‘వికసిత్ భారత్, వికసిత్ ఛత్తీస్‌గఢ్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2024 ఫిబ్రవరి 24 వ తేదీ న మధ్యాహ్నం పూట 12:30 గంటల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రసంగించనున్నారు. 34,400 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను ఇదే కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రారంభించడం మరియు దేశ ప్రజల కు అంకితమివ్వడం తో పాటు శంకుస్థాపన లు కూడా చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు రహదారులు, రైలు మార్గాలు, బొగ్గు, విద్యుత్తు, సౌర శక్తి తదితర రంగాలు సహా అనేక ముఖ్యమైనటువంటి రంగాల కు చెందినవి.

 

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేశనల్ థర్మల్ పవర్ కార్పొరేశన్ (ఎన్‌టిపిసి) కి చెందిన లారా సుపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఒకటో దశ (800 ఎమ్ డబ్ల్యు సామర్థ్యం కలిగిన రెండు యూనిట్ లు)ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు. అలాగే ఛత్తీస్‌ గఢ్ లోని రాయ్‌ గఢ్ జిల్లా లో ఎన్‌టిపిసి కే చెందిన లారా సుపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశ (2x800ఎమ్ డబ్ల్యు) కు శంకుస్థాపన చేయనున్నారు. ఎన్‌టిపిసి కి చెందిన లారా సుపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఒకటో దశ ను దాదాపు గా 15,800 కోట్ల రూపాయల పెట్టుబడి తో నిర్మించడమైంది. ప్రాజెక్టు రెండో దశ ను ఒకటో దశ పరిసరాల లో అందుబాటు లో ఉన్న భూమి లో కూడా నిర్మించండం జరుగుతుంది, ఈ ప్రకారం గా విస్తరణ కోసం అదనం గా భూమి అవసర పడదు. కాగా ఈ ప్రాజెక్టు కు 15,530 కోట్ల రూపాయలను పెట్టుబడి గా పెట్టడం జరుగుతుంది. అత్యంత ఉన్నతమైన సామర్థ్యం తో కూడిన సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ని ఒకటో దశ కు, అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాజీ ని రెండవ దశ కు జత చేయనున్నారు. ఫలితం గా ఈ ప్రాజెక్టు బొగ్గు ను గణనీయం గా ఆదా చేయడం తో పాటు గా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల స్థాయి ని కుదించి వేస్తుంది. ఈ ప్రాజెక్టు ఒకటో దశ మరియు రెండో దశ.. ఈ రెంటి లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు లో 50 శాతం విద్యుత్తు ను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాని కి కేటాయించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర. గోవా దమణ్ మరియు దీవ్, దాద్‌రా, ఇంకా నగర్ హవేలీ సహా ఇతర అనేక రాష్ట్రాల లోను మరియు కేంద్ర పాలిత ప్రాంతాల లోను విద్యుత్తు వ్యవస్థ ను మెరుగు పరచడం లో కీలకమైన పాత్ర ను పోషించనుంది.

 

 

ప్రధాన మంత్రి సౌథ్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్‌స్ లిమిటెడ్ (ఎస్ఇసిఎల్) కు చెందిన ఫస్ట్ మైల్ కనెక్టివిటీ (ఎఫ్ఎమ్‌సి) ప్రాజెక్టు లు మూడింటి ని ప్రారంభించనున్నారు. వీటి నిర్మాణాని కి మొత్తం 600 కోట్ల రూపాయల కు పైగానే వెచ్చించడం జరిగింది. ఈ ప్రాజెక్టు లు బొగ్గు ను త్వరితగతి న, పర్యావరణ అనుకూలమైన పద్ధతి లో ప్రభావ వంతమైన యంత్రీకృత తరలింపు లో సాయ పడతాయి. ఈ ప్రాజెక్టుల లో ఎస్ఇసిఎల్ కు చెందిన దీప్‌కా ప్రాంతం లోని దీప్‌కా ఒసిపి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటు మరియు ఎస్ఇసిఎల్ కు చెందిన రాయ్ గఢ్ ప్రాంతం లో ఉన్న ఛాల్, బరౌద్ ఒసిపి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటు లు భాగం గా ఉన్నాయి. ఎఫ్ఎమ్ సి ప్రాజెక్టు లు పిట్ హెడ్ నుండి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటుల వరకు యంత్రీకృత రవాణా పద్ధతి కి వీలు కల్పిస్తాయి. బొగ్గు యంత్రీకృత చేరవేత కు పూచీపడడానికి గాను సైలో, బంకర్ లు మరియు కన్వేయర్ బెల్టుల మాధ్యం ద్వారా వేగం గా లోడింగ్ సిస్టమ్ నుండి ఆధునిక కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటుల వరకు రాకపోకల కు వీలు ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు లు బొగ్గు ను రహదారి మాధ్యం లో రవాణా చేయడాన్ని తగ్గించి, బొగ్గు గనుల చుట్టు ప్రక్కల ప్రాంతాల లో నివాసం ఉండే ప్రజల జీవన స్థితుల ను మెరుగు పరచడం లో సాయపడతాయి. అంతేకాకుండా, వాహనాల రాకపోకల లో రద్దీని, రహదారి ప్రమాదాల ను కూడా తగ్గించడాని కి, పర్యావరణం పైన మరియు బొగ్గు గనుల పరిసరాల లో ఆరోగ్యం స్థితి పైన ప్రతికూల ప్రభావాలు ఏర్పడకుండా చూస్తాయి. దీనితో పిట్ హెడ్ నుండి రైల్ వే సైడింగ్ వరకు బొగ్గు ను తీసుకుపోయే ట్రక్కుల ద్వారా డీజిల్ యొక్క వినియోగాన్ని తగ్గించి రవాణా సంబంధి వ్యయాల లో కూడా ఆదా కు ఆస్కారం ఉంటుంది.

 

 

ఆ ప్రాంతం లో నవీకరణ యోగ్య శక్తి యొక్క ఉత్పాదన ను పెంచే చర్య లో భాగం గా రాజ్‌నంద్‌గాఁవ్ లో దాదాపు గా 900 కోట్ల రూపాయల ఖర్చు తో నెలకొల్పిన సోలర్ పివి ప్రాజెక్టు ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ఏటా సుమారు 243.53 మిలియన్ యూనిట్ ల శక్తి ని ఉత్పత్తి చేయడం తో పాటు, 25 సంవత్సరాల లో రమారమి 4.87 మిలియన్ టన్నుల మేర కు కార్బన్ డైఆక్సైడ్ (సిఒ2) ఉద్గారాల ను తగ్గించ గలుగుతుంది. ఇది అదే 25 ఏళ్ళ కాలం లో దాదాపు గా 8.86 మిలియన్ వృక్షాలు వాతావరణం లో నుండే సంగ్రహించే కర్బనం మోతాదు కు సమానమన్న మాట.

 

 

ఆ ప్రాంతం లో రైలు రంగాని కి సంబంధించిన మౌలిక సదుపాయాల ను పటిష్ట పరచే క్రమం లో దాదాపు గా 300 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మాణం పూర్తి అయినటువంటి బిలాస్‌పుర్ - ఉస్‌ లాపుర్ ఫ్లై ఓవరు ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. బిలాస్‌పుర్ నుండి కట్ నీ వైపు వెళ్లే బొగ్గు రవాణా ట్రక్కు లు మార్గమధ్యం లో చాలా సేపు ఆగిపోకుండా ఈ ఫ్లైఓవర్ కాచుకొంటుంది. భిలాయీ లో 50 ఎమ్‌డబ్ల్యు సామర్థ్యం కలిగిన సోలర్ పవర్ ప్లాంటు ను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. ఈ సౌర విద్యుత్తు ప్లాంటు రైళ్ళ లో సౌర శక్తి ని వినియోగించడం లో సాయ పడనుంది.

 

 

జాతీయ రాజమార్గం (ఎన్ హెచ్)- 49 లో 55.65 కిలోమీటర్ ల పొడవైన భాగం లో పేవ్ డ్ శోల్డర్ లు సహా రెండు దోవ ల మార్గం గా ఉన్నతీకరణ పూర్తి అయినటువంటి సెక్శను ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు బిలాస్‌పుర్ మరియు రాయ్‌ గఢ్ నగరాల మధ్య కనెక్టివిటీ ని మెరుగు పరచడం లో సహాయకారి కాగలదు. జాతీయ రాజమార్గం (ఎన్ హెచ్) 130 లో భాగం గా ఉన్నటువంటి 52.40 కి.మీ. పొడవైన భాగం లో పేవ్ డ్ శోల్డర్ లు సహా రెండు దోవ ల మార్గం గా ఉన్నతీకరణ పూర్తి అయినటువంటి సెక్శను ను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు రా‌య్‌పుర్, ఇంకా కోర్‌బా లతో అంబికాపుర్ నగరాని కి కనెక్టివిటీ ని మెరుగు పరచడం లో తోడ్పాటు ను అందించడం తో పాటు ఆ ప్రాంతం లో ఆర్థిక వృద్ధి కి వెన్నుదన్నుగా నిలుస్తుంది.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India is taking the nuclear energy leap

Media Coverage

India is taking the nuclear energy leap
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi commemorates Navratri with a message of peace, happiness, and renewed energy
March 31, 2025

The Prime Minister Shri Narendra Modi greeted the nation, emphasizing the divine blessings of Goddess Durga. He highlighted how the grace of the Goddess brings peace, happiness, and renewed energy to devotees. He also shared a prayer by Smt Rajlakshmee Sanjay.

He wrote in a post on X:

“नवरात्रि पर देवी मां का आशीर्वाद भक्तों में सुख-शांति और नई ऊर्जा का संचार करता है। सुनिए, शक्ति की आराधना को समर्पित राजलक्ष्मी संजय जी की यह स्तुति...”