ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఫిబ్రవరి 5న మధ్యాహ్నం ఒంటిగంటకు జైపూర్ మహాఖేల్‌లో పాల్గొనేవారిని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగిస్తారు. జైపూర్ గ్రామీణ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 2017 నుంచి అక్కడ జైపూర్ ‘మహాఖేల్’ నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జాతీయ యువదినోత్సవం సందర్భంగా 2023 జనవరి 12న ప్రారంభించిన మహాఖేల్ ఈ ఏడాది కబడ్డీ పోటీలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో జైపూర్ రూరల్ లోక్‌సభ స్థానం కిందకు వచ్చే 8 శాసనసభ స్థానాల పరిధిలోని 450కిపైగా పంచాయతీలు, పురపాలికల వార్డుల నుంచి 6,400 మంది యువకులు, క్రీడాకారులు ఇందులో పాలుపంచుకున్నారు. మహఖేల్ నిర్వహణతో జైపూర్ యువత తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించే అవకాశంతోపాటు క్రీడలను వృత్తిగా స్వీకరించేలా వారికి ప్రోత్సాహం లభిస్తుంది.