ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరుగనున్న రాష్ర్టాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల ఉమ్మడి సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
ప్రజలకు సులభతరంగా, అనుకూలమైన న్యాయం అందించేందుకు ఒక చక్కని విధానం రూపకల్పనకు, న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనగల చర్యలపై చర్చించేందుకు కార్యనిర్వాహకవర్గం, న్యాయవ్యవస్థల ఉమ్మడి సమావేశం ఒక చక్కని అవకాశంగా ఉంటుంది. 2016లో ఇలాంటిదే ఒక సమావేశం జరిగింది. అప్పటి నుంచి కోర్టుల్లో మౌలిక వసతుల మెరుగుదలకు, ఇ-కోర్టుల ఉద్యమ స్థాయి ప్రాజెక్టులో భాగంగా డిజిటలైజ్ టెక్నాలజీని అనుసంధానం చేయడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది.