ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 22న మంగళవారం మధ్యాహ్నం 12 గంటల కు గువాహాటీ ఐఐటి స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమం లో అసమ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశంక్, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే లతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాలుపంచుకోనున్నారు.
రేపటి రోజున 687 మంది బి.టెక్. విద్యార్థులు, మరో 637 మంది ఎమ్.టెక్. విద్యార్థులు సహా 1803 మంది విద్యార్థులు డిగ్రీలను అందుకోనున్నారు.