ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020వ సంవత్సరం జనవరి 28వ తేదీ న గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగే మూడో గ్లోబల్ పొటాటో కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి రిమోట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించనున్నారు.
బంగాళాదుంపల సంబంధిత పరిశోధన వ్యాపారం, పరిశ్రమ, ఇంకా వేల్యూ చైన్ మేనేజ్‌మెంట్ రంగాల లో సంపూర్ణ విజయాలు మరియు అవకాశాల ను ప్రధాన మంత్రి సమగ్రం గా సమీక్షిస్తారని, దశాబ్ది కి గాను ఒక మార్గసూచీ ని ఆయన నిర్దేశిస్తారన్న అపేక్ష నెలకొంది.
ఒక పరంపర గా సాగుతున్న సమావేశాల లో ఈ సమావేశం మూడో సమావేశం. ప్రతి పది సంవత్సరాల అంతరాళం లో బంగాళా దుంపల రంగం లో సాధించవలసిన పనుల పై కసరత్తు చేయడం, రాబోయే దశాబ్ది కోసం ఒక మార్గసూచీ ని సిద్ధం చేసుకోవడం ఆవశ్యకం గా ఉంది. ఈ దిశ గా గడచిన రెండు దశాబ్దుల లోను గ్లోబల్ పొటాటో కాన్ఫరెన్సు లు రెంటి ని 1999వ సంవత్సరం లో మరియు 2008వ సంవత్సరం లో నిర్వహించడమైంది.
ఈ సమావేశం సంబంధిత వర్గాలు అన్నిటి ని ఒక ఉమ్మడి వేదిక మీద కు తీసుకువచ్చేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. తద్వారా బంగాళాదుంపల రంగం తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి కి ప్రమేయాన్ని కల్పిస్తూ, అన్ని అంశాల ను చర్చించి భవిష్యత్తు ప్రణాళికల కు రూపకల్పన చేసేందుకు వీలు ఏర్పడుతుంది. దేశం లో వివిధ వర్గాల కు బంగాళాదుంపల పరిశోధన రంగం లో నూతన ఆవిష్కరణల ను గురించి వివరించే ఒక విశిష్టమైన కార్యక్రమమిది.
దేశం లో బంగాళాదుంపల ప్రధాన ఉత్పత్తిదారు రాష్ట్రాల లో గుజరాత్ ఒకటి గా ఉంది. గత పదకొండు సంవత్సరాల కాలం లో భారతదేశం లో బంగాళాదుంపలు పండే ప్రాంతం 19 శాతం మేర వృద్ధి చెందింది. కాగా, గుజరాత్ లో ఈ విస్తీర్ణం దాదాపు గా 170 శాతం మేరకు పెరిగింది (2006-07 లో ఇవి 49.7 వేల హెక్టేర్లు గా ఉండగా 2017-18 లో 133 వేల హెక్టేర్ల కు చేరుకొంది). ప్రతి ఒక్క హెక్టేరు కు 30 టన్నుల కు పైగా దిగుబడి తో గుజరాత్ గత పది సంవత్సరాల కాలం లో భారతదేశం లో ఒకటో స్థానాన్ని నిలబెట్టుకొన్నది. ఈ రాష్ట్రం వ్యవసాయం తాలూకు నవీన పద్ధతుల ను అనుసరిస్తూ వస్తున్నది.
ఈ రాష్ట్రం లో ఉత్తమమైన శీతలీకరణ సదుపాయాలు కూడా ఉన్నాయి. దేశం లో ప్రధానమైనటువంటి పొటాటో ప్రోసెసింగ్ ఇండస్ట్రీల కు ఈ రాష్ట్రం ఒక కేంద్రం గా ఉంది.
దీనికి తోడు, బంగాళాదుంపల ఎగుమతిదారు సంస్థల లో అనేకం గుజరాత్ లోనే నెలకొన్నాయి. దేశం లో ఒక ప్రముఖమైనటువంటి పొటాటో హబ్ గా గుజరాత్ ఆవిర్భవించేందుకు ఇది కూడా ఒక కారణం.
ఈ నేపథ్యం లో 3వ గ్లోబల్ కాన్‌క్లేవ్ ను గుజరాత్ లో నిర్వహిస్తున్నారు.
న్యూ ఢిల్లీ కి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసర్చ్, షిమ్ లా లోని ఐసిఎఆర్-సెంట్రల్ పొటాటో రిసర్చ్ ఇన్స్ టిట్యూట్ మరియు పెరూ దేశం లోని లిమా లో గల ఇంటర్‌నేశనల్ పొటాటో సెంటర్ (సిఐపి) ల సహకారం తో ఇండియన్ పొటాటో అసోసియేశన్ (ఐపిఎ) ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది.
ఈ బృహత్ కార్యక్రమం లో.. (1) ద పొటాటో కాన్ఫరెన్స్, (2) ద అగ్రి ఎక్స్‌పో మరియు (3) ద పొటాటో ఫీల్డ్ డే.. అని మూడు ముఖ్య భాగాలు ఉంటాయి.
పొటాటో కాన్ఫరెన్స్ ను 2020వ సంవత్సరం జనవరి 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. దీని లో పది ఇతివృత్తాలు ఉంటాయి. మళ్ళీ ఆ ఇతివృత్తాల లో ఎనిమిది ఇతివృత్తాలు మౌలిక పరిశోధన మరియు అప్లయ్ డ్
రిసర్చ్ లు ఆధారం గా ఉంటాయి. మిగతా రెండు ఇతివృత్తాలు బంగాళాదుంపల వ్యాపారం, వేల్యూ చైన్ మేనేజ్‌మెంట్ మరియు విధానపరమైన అంశాల పట్ల ప్రత్యేక ప్రాముఖ్యాన్ని కలిగివుంటాయి.
అగ్రి ఎక్స్‌పో ను 2020వ సంవత్సరం జనవరి 28వ తేదీ నుండి జనవరి 30వ తేదీ వరకు నిర్వహిస్తారు. దీని లో భాగం గా బంగాళాదుంపల ఆధారిత పరిశ్రమల స్థాయి మరియు వ్యాపారం, ప్రోసెసింగ్, విత్తన బంగాళాదుంపల ఉత్పత్తి, బయోటెక్నాలజీ, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం లతో పాటు, రైతుల కు సంబంధించిన ఉత్పత్తులు వగైరా అంశాల ను దీని లో ప్రదర్శించనున్నారు.
2020వ సంవత్సరం జనవరి 31వ తేదీన పొటాటో ఫీల్డ్ డే ను జరుపుతారు. దీని లో భాగం గా.. బంగాళాదుంపల రకాలు, బంగాళాదుంపల రంగం లో యాంత్రీకరణ తాలూకు పురోగతి, ఇంకా ఆధునిక సాంకేతిక విజ్ఞానం.. వీటి ప్రదర్శన చోటు చేసుకొంటుంది.
ప్రధానం గా చర్చకు వచ్చే అంశాల లో నాట్ల కు అవసరమైన సామగ్రి, సరఫరా శృంఖలాల యొక్క కొరత, పంటకోత ల అనంతరం వాటిల్లే నష్టాలు, ప్రోసెసింగ్ ను పెంపొందించడానికి తీసుకోవలసిన చర్యల తో పాటు ఎగుమతులు మరియు వివిధరీతుల ఉపయోగం, ఇంకా అవసరమైన విధాన సంబంధి సహాయం- అంటే ప్రమాణీకరణ పొందిన విత్తనాల ఉత్పత్తి మరియు వినియోగం, బహు దూర ప్రాంతాలకు రవాణా కు మరియు ఎగుమతులను ప్రోత్సాహించడానికి తోడ్పాటు లు వంటివి భాగం గా ఉంటాయి.