మహిళ ల అంతర్జాతీయ దినం సందర్భం లో కచ్ఛ్ లోని ధోర్ డో లో ఏర్పాటైన ఒక చర్చా సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయంత్రం 6 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. సమాజం మహిళా సాధువుల పాత్ర ను మరియు మహిళల సశక్తీకరణ దిశ లో వారు అందిస్తున్న తోడ్పాటు ను గుర్తించడం కోసం ఈ సెమినార్ ను ఏర్పాటు చేయడం జరుగుతోంది. 500కు పైగా మహిళా సాధువులు ఈ సెమినార్ కు హాజరు కానున్నారు.
ఈ చర్చా సభ లో భాగం గా సంస్కృతి, మతం, మహిళల అభ్యున్నతి, భద్రత, సమాజం లో మహిళ ల స్థాయి మరియు భారతదేశ సంస్కృతి లో భూమిక లపై సదస్సు లు ఉంటాయి. మహిళల కు ప్రయోజనకరం గా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలతో పాటు మహిళ ల కార్యసాధనలపైన కూడా చర్చించడం జరుగుతుంది.
కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ గారు, సహాయ మంత్రులు సాధ్వి నిరంజన్ జ్యోతి గారు, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ గారు లు కూడా ఈ సెమినార్ లో పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమం లో సాధ్వి రుతంబర, మహా మండలేశ్వర్ కనకేశ్వరి దేవి తదితర ప్రముఖులు పాల్గొంటారు.