సెంట్రల్ విజిలెన్స్ కమిశన్ (సివిసి) ఆధ్వర్యం లో నిఘా జాగృతి వారం కార్యక్రమాని కి గుర్తు గా నవంబర్ 3వ తేదీ నాడు ఉదయం పూట 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగే కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.
ఈ సందర్భం లో, ప్రధాన మంత్రి సివిసి కి సంబంధించిన కొత్త ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ యొక్క పోర్టల్ ను ప్రారంభిస్తారు. ఈ పోర్టల్ ను పౌరుల కు వారి ఫిర్యాదు లు ఏ స్థితి లో ఉన్నదీ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించడానికి రూపొందించడమైంది. ‘‘ఎథిక్స్ ఎండ్ గుడ్ ప్రాక్టీసెస్’’ అనే అంశం పై రూపొందించిన చిన్న పుస్తకాల శ్రేణి ని, ‘‘ప్రివెంటివ్ విజిలెన్స్’’ అనే అంశం పై ఉత్తమ అభ్యాసాల సంకలనాన్ని, అలాగే సార్వజనిక సేకరణ అనే అంశం పై రూపొందించిన ‘‘విజ్ఐ-వాణి’’ ప్రత్యేక సంచిక ను కూడా ప్రధాన మంత్రి విడుదల చేయనున్నారు.
జీవనం లోని అన్ని రంగాల లో నిజాయతీ ని పరిరక్షించాలనే సందేశాన్ని వ్యాప్తి చేయడం కోసం సంబంధిత అన్ని వర్గాల ను ఏకతాటి మీదకు తీసుకు రావడం కోసం విజిలెన్స్ అవేర్ నెస్ వీక్ కార్యక్రమాన్ని సివిసి ఏటా పాటిస్తుంటుంది. ఈ సంవత్సరం లో, దీని ని అక్టోబర్ 31వ తేదీ మొదలుకొని నవంబర్ 6వ తేదీ వరకు ఒక అభివృద్ధి చెందిన దేశం కోసం అవినీతి కి తావు ఉండనటువంటి భారతదేశం’’ అనే ఇతివృత్తం తో పాటించడం జరుగుతున్నది. నిఘా జాగృతి వారం తాలూకు పైన ప్రస్తావించిన ఇతివృత్తం తో సివిసి నిర్వహించిన ఒక దేశ వ్యాప్త వ్యాస రచన పోటీ లో ఉత్తమమైన వ్యాసాల ను వ్రాసిన అయిదుగురు విద్యార్థుల కు బహుమతుల ను కూడా ప్రధాన మంత్రి ప్రదానం చేయనున్నారు.