శ్రీల ప్రభుపాద గారి యొక్క 150 వ జయంతి కి గుర్తు గా ఫిబ్రవరి 8వ తేదీ న మధ్యాహ్నం పూట సుమారు 12 గంటల 30 నిమిషాల కు ప్రగతి మైదాన్ లోని భారత్ మండపమ్ లో జరిగే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. మహా ఆధ్యాత్మిక గురువు శ్రీల ప్రభుపాద జీ గౌరవార్థం ఒక సంస్మారక స్టాంపు ను మరియు ఒక నాణేన్ని ప్రధాన మంత్రి విడుదల చేయనున్నారు.
ఆచార్య శ్రీల ప్రభుపాద గౌడీయ మఠం వ్యవస్థాపకుడు. వైష్ణవ విశ్వాసం యొక్క మౌలిక సిద్ధాంతాలను పరిరక్షించడం మరియు వ్యాప్తి చేయడం లో ఒక మహత్వపూర్ణమైనటువంటి పాత్ర ను ఆయన పోషించారు. గౌడీయ మఠం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనల ను మరియు వైష్ణవ ధర్మం సంబంధి సమృద్ధమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచం అంతటా ప్రచారం చేయడం లో కీలక భూమిక ను నిర్వర్తించిం ది. ఈ విధం గా హరే కృష్ణ ఉద్యమాన్ని గౌడీయ విశ్వాసం యొక్క కేంద్రం గా ఆయన తీర్చిదిద్దారు.