ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని జ్ఎల్ఎన్ స్టేడియంలో పీఎం స్వనిధి పథకం లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఢిల్లీకి చెందిన 5,000 మంది వీధి వ్యాపారులతో సహా మొత్తం 1 లక్ష మంది వీధి వ్యాపారులకు (ఎస్‌వి) ఈ పథకం కింద రుణాలు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ఢిల్లీ మెట్రో 4వ దశ రెండు అదనపు కారిడార్‌లకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.
అట్టడుగు వర్గాలకు ఆర్థిక సహాయాన్ని అందించాలనే ప్రధాన మంత్రి దృష్టికోణంతో, మహమ్మారి వల్ల ఏర్పడిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం మధ్య 1 జూన్, 2020న పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించారు. వీధి వ్యాపారుల అట్టడుగు వర్గాలకు ఇది గొప్ప ప్రయోజనం కలిగించింది. ఇప్పటి వరకు 82 లక్షలకు పైగా రుణం, దేశవ్యాప్తంగా 62 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.10,978 కోట్లు పంపిణీ చేశారు. ఒక్క ఢిల్లీలోనే దాదాపు 2 లక్షల రుణాల పంపిణీ జరగగా, వాటి విలువ రూ. 232 కోట్లు ఉంటుంది. ఎంతో కాలంగా వెనుకబడిన వారికి ఆర్థిక సమ్మిళిత, సమగ్ర సంక్షేమం కోసం ఈ పథకం కొనసాగుతోంది.
ఈ కార్యక్రమం సందర్భాంగానే, ఢిల్లీ మెట్రో రెండు అదనపు కారిడార్‌లకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు: లజ్‌పత్ నగర్ - సాకేత్-జి బ్లాక్, ఇందర్లోక్ - ఇంద్రప్రస్థ మధ్య ఈ కారిడార్లు మొత్తం 20 కిలోమీటర్లకు పైగా పొడవును కలిగి ఉంటాయి. కనెక్టివిటీని మెరుగుపరచడంలో, ట్రాఫిక్ రద్దీని మరింత తగ్గించడంలో సహాయపడతాయి. లజపత్ నగర్ నుండి సాకేత్ జి-బ్లాక్ కారిడార్‌లోని ఉండే స్టేషన్‌లు : లజపత్ నగర్, ఆండ్రూస్ గంజ్, గ్రేటర్ కైలాష్ - 1, చిరాగ్ ఢిల్లీ, పుష్ప భవన్, సాకేత్ జిల్లా కేంద్రం, పుష్ప్ విహార్, సాకేత్ జి - బ్లాక్. ఇందర్లోక్ - ఇంద్రప్రస్థ కారిడార్‌లోని స్టేషన్‌లలో ఇందర్‌లోక్, దయా బస్తీ, సరాయ్ రోహిల్లా, అజ్మల్ ఖాన్ పార్క్, నబీ కరీం, న్యూఢిల్లీ, ఎల్‌ఎన్‌జెపి హాస్పిటల్, ఢిల్లీ గేట్, ఢిల్లీ సచివాలయ, ఇంద్రప్రస్థ ఉన్నాయి.