శ్రీ శ్రీ హరిచంద్ ఠాకూర్ జీ 211వ జయంతి సందర్భం లో పశ్చిమ బంగాల్ లో ఠాకూర్ బాడీ లో గల శ్రీధామ్ ఠాకూర్ నగర్ లో మార్చి నెల 29వ తేదీ న మతువా ధర్మ మహా మేళా 2022 ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రోజు న సాయంత్రం పూట 4:30 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.
శ్రీ శ్రీ హరిచంద్ ఠాకుర్ జీ తన జీవనాన్ని అణచివేత బారిన పడినటువంటి, అణగారిన వర్గాల కు చెందినటువంటి మరియు ఆదరణ కు నోచుకోనటువంటి వ్యక్తుల శ్రేయస్సు కోసం అంకితం చేశారు. ఆయన మొదలు పెట్టిన సామాజిక మరియు ధార్మిక ఉద్యమం 1860వ సంవత్సరం లో ఓరాకాండీ (ఇప్పుడు బాంగ్లాదేశ్ లో ఉంది) నుంచి ఆరంభమై, మతువా ధర్మం స్థాపన కు దారి తీసింది.
మతువా ధర్మ మహా మేళా 2022 ను అఖిల భారత మతువా మహాసంఘ ఈ నెల 29వ తేదీ మొదలుకొని ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించనుంది.