ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 వ సంవత్సరం జులై 30 వ తేదీ నాడు ఉదయం పూట 10 గంటల కు విజ్ఞాన్ భవన్ లో జరిగే అఖిల భారత జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ ల ఒకటో సమ్మేళనం యొక్క ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (ఎన్ఎఎల్ఎస్ఎ) 2022వ సంవత్సరం జులై 30వ మరియు 31వ తేదీల లో విజ్ఞాన్ భవన్ లో జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ ల (డిఎల్ఎస్ఎ స్) ఒకటో జాతీయ స్థాయి సమావేశాల ను నిర్వహించనుంది. డిఎల్ఎస్ఎ లన్నింటి మధ్య ఏకరూపత తెచ్చందుకు మరియు సమన్వయాన్ని నెలకొల్పేందుకు ఒక ఏకీకృత ప్రక్రియ ను రూపొందించడం గురించి ఈ సమావేశాల లో చర్చ జరుగుతుంది.
దేశం లో మొత్తం 676 జిల్లా వారీ న్యాయ సేవల ప్రాధికార సంస్థ లు (డిఎల్ఎస్ఎ స్) ఉన్నాయి. ఈ ప్రాధికార సంస్థల కు జిల్లా న్యాయమూర్తి నాయకత్వం వహిస్తున్నారు. జిల్లా న్యాయమూర్తి వీటికి చైర్ మన్ గా కూడా వ్యవహరిస్తుంటారు. డిఎల్ఎస్ఎ లు మరియు రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ లు (ఎస్ఎల్ఎస్ఎ స్) ద్వారా వివిధ న్యాయ సహాయం మరియు చైతన్యం సంబంధిత కార్యక్రమాల ను ఎన్ఎఎల్ఎస్ఎ అమలు పరుస్తుంటుంది. ఎన్ఎఎల్ఎస్ఎ నిర్వహిస్తున్నటువంటి లోక్ అదాలత్ లను డిఎల్ఎస్ఎ లు క్రమబద్ధం చేస్తూ, తద్ద్వారా న్యాయస్థానాల పై భారాన్ని తగ్గించే దిశ లో సైతం తోడ్పాటు ను అందిస్తున్నాయి.