ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 15వ తేదీ నాడు ఉదయం పూట 10:30 గంటల కు వీడియో సందేశం ద్వారా న్యాయ మంత్రి మరియు న్యాయ కార్యదర్శుల అఖిల భారత సమావేశం తాలూకు ప్రారంభిక సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
రెండు రోజుల పాటు జరుగబోయే ఈ సమావేశాని కి చట్టం మరియు న్యాయం మంత్రిత్వ శాఖ గుజరాత్ లోని ఏకతా నగర్ ఆతిథేయి గా వ్యవహరిస్తోంది. భారతదేశం లో చట్టం మరియు న్యాయం వ్యవస్థ కు సంబంధించిన అంశాల ను చర్చించడం కోసం ఒక ఉమ్మడి వేదిక ను అందించాలి అన్నదే ఈ సమావేశం యొక్క ధ్యేయం గా ఉంది. ఈ సమావేశం లో పాలుపంచుకోవడం ద్వారా రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు వాటి వాటి ఉత్తమ అభ్యాసాల ను, కొత్త ఆలోచనల ను గురించి వెల్లడించి పరస్పర సహకారాన్ని మెరుగుపరచుకోగలుగుతాయి.
ఈ సమావేశం లో ఆర్బిట్రేశన్ మరియు సత్వర న్యాయానికి, ఇంకా తక్కువ ఖర్చు లో న్యాయాని కై ఉన్న మధ్యవర్తిత్వ మార్గం ల వంటి ప్రత్యామ్నాయ విభాగ పరిష్కార యంత్రాంగాలు; చట్ట సంబంధ మౌలిక సదుపాయాల ను సమగ్రమయిన రీతిలో ఉన్నతీకరించడం; కాలం చెల్లిన చట్టాల ను తొలగించడం; న్యాయాన్ని అందుకోవడానికి మెరుగైన మార్గాలు; కేసు లు పరిష్కారం కాకుండా ఉండడాన్ని తగ్గించడం తో పాటు శీఘ్ర నిర్ణయాల ను తీసుకొనేటట్లు చూడటం; కేంద్రానికి, రాష్ట్రాల కు మధ్య ఉత్తమ సమన్వయం కోసం స్టేట్ బిల్స్ కు సంబంధించిన ప్రతిపాదనల లో ఏకరూపత ను తీసుకురావడం;రాష్ట్ర చట్ట వ్యవస్థల ను పటిష్ఠపరచడం మొదలైన అంశాల పైన చర్చ లు జరుగనున్నాయి.