Quoteఈ గ్రాండ్ ఫినాలే లో 75 కేంద్రాల కు చెందిన 15,000 కు పైగా విద్యార్థులుపాలుపంచుకోనున్నారు
Quote2900 కు పైగా పాఠశాల లు మరియు 2200 ఉన్నత విద్య సంస్థల కు చెందినవిద్యార్థులు ఈ ఫినాలే లో 53 కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి అందిన 476 సమస్యల ను పరిష్కారాల ను కనుగొనేందుకుకృషి చేస్తారు
Quoteఉత్పత్తుల లో నవ్యత, సమస్యల ను పరిష్కరించడం, మూస పద్ధతి కి భిన్నమైన ఆలోచనల నుచేయడం వంటి సంస్కృతి ని యువత లో అలవరచడం లో ‘స్మార్ట్ ఇండియా హాకథన్’ లు ఒక ముఖ్య పాత్ర ను పోషించాయి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 25 వ తేదీ నాడు రాత్రి 8 గంటల కు ‘స్మార్ట్ ఇండియా హాకథన్ 2022’ యొక్క గ్రాండ్ ఫినాలే ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.

దేశం లో ప్రత్యేకించి యువతీ యువకుల లో నూతన ఆవిష్కరణల కు సంబంధించినటువంటి స్ఫూరిని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి నిరంతరం ప్రయాస లు చేస్తూ వస్తున్నారు. ఇదే దార్శనికత ను అనుసరిస్తూ, స్మార్ట్ ఇండియా హాకథన్ (ఎస్ఐహెచ్) ను 2017 వ సంవత్సరం లో మొదలు పెట్టడమైంది. ఎస్ఐహెచ్ అనేది సమాజం యొక్క, సంస్థల యొక్క మరియు ప్రభుత్వం యొక్క అనేక చిక్కు సమస్యల ను పరిష్కరించడాని కి విద్యార్థుల కు ఒక వేదిక ను సమకూర్చేటటువంటి ఒక దేశవ్యాప్త కార్యక్రమం గా ఉన్నది. ఇది విద్యార్థుల లో ఉత్పత్తి పరమైన నూతన ఆవిష్కరణ, సమస్య ను పరిష్కరించడం లతో పాటు గా అంతవరకు అవలంబిస్తున్న ఆలోచన విధానాని కి భిన్నం గా సరికొత్త ఆలోచన లను చేసే సంప్రదాయాన్ని నెలకొల్పాలని ధ్యేయం గా పెట్టుకొంది.

ఎస్ఐహెచ్ లో నమోదు లు చేసుకొంటున్న బృందాల సంఖ్య తొలి సంచిక లో సుమారు 7500 గా ఉన్నది కాస్తా తాజా అయిదో సంచిక కు వచ్చే సరికి నాలుగింతల వృద్ధి తో ఇంచుమించు 29,600 కు చేరుకోవడాన్నిబట్టి ఈ కార్యక్రమాని కి పెరుగుతున్న లోకప్రియత్వాన్ని గమనించవచ్చును. ఈ సంవత్సరం లో 15,000 మంది కి పైగా విద్యార్థులు మరియు మార్గదర్శకులు ఎస్ఐహెచ్ 2022 గ్రాండ్ ఫినాలే లో భాగం పంచుకోవడం కోసం 75 నోడల్ కేంద్రాల కు చేరుకొంటున్నారు. 2900 కు పైగా పాఠశాల లు మరియు 2200 ఉన్నత విద్య సంస్థల కు చెందిన విద్యార్థులు ఫినాలే లో పాల్గొని, 53 వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి అందే 476 సమస్యల కు (వీటి లో ఆలయాల కు చెందిన శిలా శాసనాల కు సంబంధించిన ఆప్టికల్ కేరిక్టర్ రెకగ్ నిశన్ (ఒసిఆర్) దేవనాగరి లిపి లోని అనువాదాలు, త్వరగా పాడయిపోయే ఆహార పదార్థాల కోసం ఉద్దేశించినటువంటి కోల్డ్ సప్లయ్ చైన్ లో ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) ఆధారిత రిస్క్ మానిటరింగ్ సిస్టమ్, విపత్తు విరుచుకుపడ్డ వంటి ప్రాంతాల లో భూమి, మౌలిక సదుపాయాలు మరియు రహదారుల స్థితుల పై అధిక స్పష్టత తో కూడినటువంటి 3డి నమూనా మొదలైనవి సహా ఉంటాయి) పరిష్కారాల ను కనుగొనేందుకు కృషి చేయనున్నారు.

ఈ సంవత్సరం లో, పాఠశాల విద్యార్థుల మనస్తత్వాన్ని అభివృద్ధి పరచడం తో పాటు నూతన ఆవిష్కరణల సంస్కృతి ని తీర్చిదిద్దడం కోసమని పాఠశాల విద్యార్థుల కు ఒక ప్రయోగాత్మక కార్యక్రమమా అన్నట్లు గా ‘స్మార్ట్ ఇండియా హాకథన్-జూనియర్’ ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
How the makhana can take Bihar to the world

Media Coverage

How the makhana can take Bihar to the world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 ఫెబ్రవరి 2025
February 25, 2025

Appreciation for PM Modi’s Effort to Promote Holistic Growth Across Various Sectors