ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 సెప్టెంబర్ 26 వ తేదీ నాడు సాయంత్రం పూట సుమారు 4 గంటల వేళ కు న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో జి-20 యూనివర్సిటీ కనెక్ట్ ఫినాలి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
జి-20 ప్రజల భాగస్వామ్యం సంబంధి ప్రచార ఉద్యమం లో దేశవ్యాప్తం గా వేరు వేరు పాఠశాల లు, ఉన్నత విద్య సంస్థ లు మరియు నైపుణ్య అభివృద్ధి సంస్థ ల నుండి రికార్డు స్థాయి లో 5 కోట్ల మంది కి పైచిలుకు యువతీ యువకులు పాలుపంచుకొన్నారు. జి-20 యూనివర్సిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని జి-20 కి భారతదేశం అధ్యక్షత వహించడాని కి సంబంధించి భారతదేశ యువత లో అవగాహన ను కల్పించాలనే మరియు జి-20 కి సంబంధించిన విభిన్న కార్యక్రమాల లో వారి యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందింప చేయాలనే ఉద్దేశ్యాల తో మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లో యావత్తు దేశం లో విభిన్న విశ్వవిద్యాలయాల కు చెందిన ఒక లక్ష మంది కి పైగా విద్యార్థినీ విద్యార్థులు చేరారు. భారతదేశాని కి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావడాన్ని స్మరించుకొనేందుకు ఈ కార్యక్రమాన్ని ఆరంభం లో 75 విశ్వవిద్యాలయాల లో నిర్వహించాలని పథక రచన జరిగింది. తరువాత ఈ కార్యక్రమం పరిధి ని చివర కు పూర్తి భారతదేశం లో 101 విశ్వవిద్యాలయాల కు విస్తరించడమైంది.
జి-20 యూనివర్సిటీ కనెక్ట్ కార్యక్రమం లో భాగం గా దేశవ్యాప్తం గా అనేక కార్యక్రమాల ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల లో ఉన్నత విద్య సంస్థ లకు చెందిన వారు ముమ్మరం గా పాల్గొన్నారు. మొదట్లో విశ్వవిద్యాలయాల కోసం ఒక కార్యక్రమం గా మొదలైన ఈ ప్రచార ఉద్యమం త్వరిత గతి న వృద్ధి చెందుతూ పోయి మరి దీనిలో పాఠశాల లు మరియు కళాశాల లు చేరిపోయాయి. ఇది పెద్ద సంఖ్య లో శ్రోతల కు చేరువ అయిపోయింది.
జి-20 యూనివర్సిటీ కనెక్ట్ ఫినాలి లో కార్యక్రమ స్థలి కి సుమారు 3,000 మంది విద్యార్థులు , ఫేకల్టీ సభ్యులు మరియు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొంటూ వచ్చిన విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్ లు తరలి రానున్నారు. దేశం అంతటి నుండి విద్యార్థులు కూడాను ఈ కార్యక్రమం లో ప్రత్యక్ష ప్రసార మాధ్యం లో జతపడనున్నారు.