శ్రీ లచిత్ బర్ ఫూకన్ 400వ జయంతి ని పురస్కరించుకొని సంవత్సరం పాటు నిర్వహించిన ఉత్సవాల ముగింపు సందర్భం లో 2022 నవంబర్ 25వ తేదీ న ఉదయం 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.
మరుగున పడిపోయినటువంటి వీరుల ను సముచిత రీతి న గౌరవించుకోవాలనేదే ప్రధాన మంత్రి నిరంతర ప్రయాస గా ఉంటూ వస్తోంది. దీనికి అనుగుణం గానే, దేశం 2022వ సంవత్సరాన్ని శ్రీ లచిత్ బర్ ఫూకన్ 400వ జయంతి సంవత్సరం గా జరుపుకొంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరి లో భారతదేశం రాష్ట్రపతి గౌరవనీయుడు శ్రీ రాం నాథ్ కోవింద్ ఈ ఉత్సవాల ను గువాహాటీ లో ప్రారంభించారు.
శ్రీ లచిత్ బర్ ఫూకన్ (జననం: 24వ తేదీ నవంబర్, 1622 మరణం: 25వ తేదీ ఏప్రిల్, 1672) అసమ్ కు చెందిన అహోమ్ సామ్రాజ్యం యొక్క రాయల్ ఆర్మీ కి జనరల్ గా ప్రసిద్ధికెక్కారు. రాయల్ ఆర్మీ ముఘలుల ను ఓడించడం తో పాటు ఔరంగజేబ్ నాయకత్వం లో అంతకంతకూ విస్తరించాలన్న ముఘలు ల ఆకాంక్షల ను విజయవంతం గా అడ్డుకొంది కూడాను. 1671వ సంవత్సరం లో జరిగిన సరాయి ఘాట్ సంగ్రామం లో పాల్గొన్న అసమ్ సైనికుల లో శ్రీ లచిత్ బర్ ఫూకన్ స్ఫూర్తి ని నింపి, దరిమిలా ముఘలుల ను అణచివేసి వారు చిన్నబుచ్చుకొన్నటువంటి పరాజయం పాల్జేశారు. శ్రీ లచిత్ బర్ ఫూకన్ మరియు ఆయన ఆధ్వర్యం లోని సైన్యం సలిపిన వీరోచిత పోరు మన దేశ చరిత్ర లో అత్యంత ప్రేరణాత్మకం అయినటువంటి సైనిక ప్రతిఘటనయుక్త సాహసకృత్యాల లో ఒకటి గా నిలచింది.