భగవాన్ శ్రీ దేవ్ నారాయణ్ జీ యొక్క 1111 వ ‘అవతరణ్ మహోత్సవ్’ ను స్మరించుకొనేందుకు రాజస్థాన్ లోని భీల్ వాడా లో ఏర్పాటైన వేడుక ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ మోదీ జనవరి 28 వ తేదీ న ఉదయం 11 గంటల 30 నిమిషాల కు ప్రసంగించనున్నారు. ప్రధాన మంత్రి ఆ కార్యక్రమాని కి ముఖ్య అతిథి గా ఉంటారు.
భగవాన్ శ్రీ దేవ్ నారాయణ్ జీ ని రాజస్థాన్ ప్రజలు ఆరాధిస్తారు. ఆయన అనుచరులు దేశం నలు మూలల విస్తరించి ఉన్నారు. ప్రత్యేకించి సార్వజనిక సేవ రంగం లో భగవాన్ శ్రీ దేవ్ నారాయణ్ జీ చేసినటువంటి కార్యాల కు గాను ఆయన ను గౌరవించడం జరుగుతున్నది.