ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 18వ తేదీన మధ్యాహ్నం పూట దాదాపు గా ఒంటి గంట నలభై అయిదు నిమిషాల కు న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో 90వ ఇంటర్ పోల్ జెనరల్ అసెంబ్లీ ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇంటర్ పోల్ యొక్క 90వ జెనరల్ అసెంబ్లి అక్టోబర్ 18వ తేదీ మొదలుకొని 21వ తేదీ వరకు జరుగనుంది. ఈ సమావేశం లో ఇంటర్ పోల్ లోని 195 సభ్యత్వ దేశాల నుండి ప్రతినిధులు హాజరుకానున్నారు. వారిలో మంత్రులు, విభిన్న దేశాల పోలీస్ ప్రముఖులు, నేశనల్ సెంట్రల్ బ్యూరో ల అధిపతులు మరియు వరిష్ఠ పోలీస్ అధికారులు కూడా ఉంటారు. జెనరల్ అసెంబ్లి అనేది ఇంటర్ పోల్ లో సర్వోన్నత పాలక మండలి గా ఉంది. అది ఇంటర్ పోల్ యొక్క పనితీరు కు సంబంధించినటువంటి మహత్వపూర్ణ నిర్ణయాలను తీసుకోవడం కోసం సంవత్సరం లో ఒకసారి సమావేశాన్ని నిర్వహిస్తూ ఉంటుంది.
భారతదేశం లో ఇంటర్ పోల్ జెనరల్ అసెంబ్లి సుమారు 25 సంవత్సరాల తరువాత జరుగుతున్నది. ఈ సమావేశం భారతదేశం లో కడపటి సారి గా 1997వ సంవత్సరం లో జరిగింది. భారతదేశానికి స్వాతంత్ర్యం తాలూకు 75 ఏళ్ల మహోత్సవాలతో పాటే 2022వ సంవత్సరం లో ఇంటర్ పోల్ జెనరల్ అసెంబ్లి కి కూడా ఆతిథేయి గా ఉంటామని భారతదేశం ప్రతిపాదించగా ఆ ప్రతిపాదన ను జెనరల్ అసెంబ్లి అధిక సంఖ్యక సమర్థన తో ఆమోదించింది. ఈ కార్యక్రమ నిర్వహణ అనేది భారతదేశం యొక్క శాంతి మరియు వ్యవస్థ తో ముడిపడ్డ సర్వశ్రేష్ఠ కార్యప్రణాళికల ను యావత్తు ప్రపంచం సమక్షం లో చాటేందుకు ఒక అవకాశాన్ని ప్రసాదిస్తున్నది.
ఈ కార్యక్రమం లో కేంద్ర హోం శాఖ మంత్రి, ఇంటర్ పోల్ యొక్క అధ్యక్షుడు శ్రీ అహ్మద్ నాసెర్ అల్ రయీసీ మరియు సెక్రట్రి జనరల్ శ్రీ జర్గెన్ స్టాక్ లతో పాటు సిబిఐ డైరెక్టర్ కూడా పాలుపంచుకొంటారు.