శ్రీరామ నవమి ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ న మధ్యాహ్నం ఒంటి గంట కు గుజరాత్ లోని జూనాగఢ్ లో ఘాటిలా లో ఉమియా మాత మందిరం 14వ స్థాపన దిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాద్యమం ద్వారా ప్రసంగించనున్నారు.
మందిరాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2008వ సంవత్సరం లో ప్రారంభించారు. అప్పట్లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నారు. ప్రధాన మంత్రి 2008వ సంవత్సరం లో చేసిన సూచన ల ప్రకారం, మందిర ట్రస్టు వివిధ సామాజిక మరియు ఆరోగ్య సంబంధి కార్యకలాపాల పరిధి ని విస్తరించింది. ఉచితం గా కంటిపొర శస్త్ర చికిత్సలు, ఆర్థికంగా తాహతు లేనటువంటి రోగుల కు ఆయుర్వేద మందుల ను ఉచితం గా అందించడం చేస్తున్నది.
ఉమియా మాత ను కద్ వా పాటీదార్ ల కులదేవత గా భావిస్తారు.