ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023వ సంవత్సరం లో జనవరి 3వ తేదీ నాడు ఉదయం 10 గంటల 30 నిమిషాల వేళ లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్ సి) ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ సంవత్సరం ఐఎస్ సి లో ప్రధానమైన ఇతివృత్తం గా ‘‘మహిళల కు సశక్తీకరణ కల్పన తో సహా నిరంతర అభివృద్ధి సాధన కోసం విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం అండదండ లను పొందడం’’ అనే దానిని ఎంపికచేయడమైంది. ఈ మహాసభ నిర్వహణ క్రమం లో నిరంతర అభివృద్ధి, మహిళ ల సశక్తీకరణ మరియు వీటిని సాధించడం లో విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం ల పాత్ర అనే అంశాల పై చర్చ లు చోటు చేసుకోనున్నాయి. ఈ మహాసభ లో పాల్గొనే మహిళల కు సైన్స్, టెక్నాలజీ, ఇంజీనియరింగ్, మేథమేటిక్స్ (ఎస్ టిఇఎమ్) సంబంధి విద్య, పరిశోధన పరమైన అవకాశాలు, ఇంకా ఆర్థిక భాగస్వామ్యం వరకు సమానమైన అవకాశాల ను అందజేసే పద్ధతుల ను వెతకే ప్రయాసల తో పాటు గా శిక్షణ, పరిశోధన మరియు పరిశ్రమ రంగాల లోని ఉన్నత స్థాయిల లో మహిళల యొక్క సంఖ్య ను పెంపు చేయడం కోసం అనుసరించవలసిన మార్గాల పైన కూడా చర్చల ను మరియు వాదోపవాదాల ను జరపనున్నారు. విజ్ఞాన శాస్త్రం లో మరియు సాంకేతిక విజ్ఞానం లో మహిళ ల తోడ్పాటు ను కళ్లకు కట్టేటందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రదర్శనల లో భాగం గా ప్రసిద్ధ మహిళా శాస్త్రవేత్త లు ఉపన్యాసాల ను ఇస్తారు.
ఐఎస్ సి తో పాటు గా అనేక ఇతర కార్యక్రమాల ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బాలల్లో విజ్ఞాన శాస్త్ర సంబంధమైన ఆసక్తి ని మరియు స్వభావాన్ని ప్రోత్సహించడంలో సాయపడేందుకు గాను చిల్డన్స్ సైన్స్ కాంగ్రెసు ను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్ యేమో బయో- ఇకానమి ని మెరుగుపరచడానికి మరియు వ్యవసాయం వైపునకు యువతీయువకుల ను ఆకర్షించడానికి ఒక వేదిక ను అందించనుంది. ట్రైబల్ సైన్స్ కాంగ్రెసు ను సైతం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ట్రైబల్ సైన్స్ కాంగ్రెస్ ఆదివాసి మహిళల సశక్తీకరణ పైన కూడా శ్రద్ధ ను వహిస్తూనే, స్వదేశీ ప్రాచీన జ్ఞాన ప్రణాళిక మరియు అభ్యాసం తాలూకు విజ్ఞాన శాస్త్ర పద్ధతుల ను చాటిచెప్పేందుకు ఒక వేదిక ను కూడా అందించనున్నది.
ఈ విధమైనటువంటి కాంగ్రెస్ యొక్క ఒకటో సమావేశాన్ని 1914వ సంవత్సరం లో ఏర్పాటు చేయడమైంది. ఐఎస్ సి తాలూకు 108వ వార్షిక సభ ను రాష్ట్రసంత్ తుక్ డోజి మహారాజ్ నాగ్ పుర్ యూనివర్సిటి లో నిర్వహించడం జరుగుతుంది. ఈ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం లో తన శతాబ్ది ని కూడా జరుపుకొంటోంది.