అయోధ్య ధామ్ లో శ్రీ రామ దేవాలయం లో రేపటి రోజు న జరగవలసిఉన్న ప్రాణ ప్రతిష్ఠ కు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ ఘట్టానికి తన శుభాకాంక్షల ను వ్యక్తం చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చరిత్రాత్మక క్షణం భారతదేశం యొక్క అభివృద్ధి యాత్ర ను క్రొత్త శిఖరాల కు చేర్చడం తో పాటు గా దేశం యొక్క వారసత్వాన్ని మరియు సంస్కృతి ని సమృద్ధం కూడా చేయగలదన్న ఆశ ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
ప్రాణ ప్రతిష్ఠ కు ముందు రోజు న ప్రధాన మంత్రి కి రాష్ట్రపతి ఒక లేఖ ను వ్రాశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
‘‘గౌరవనీయురాలు @rashtrapatibhvn గారు,
అయోధ్య ధామ్ లో రామ్ లలా యొక్క ప్రాణ ప్రతిష్ఠ పవిత్ర సందర్భం లో శుభాకాంక్షల ను వ్యక్తం చేసినందుకు గాను మీకు అనేకానేక కృతజ్ఞతలు. ఈ ఐతిహాసిక క్షణం భారతీయ వారసత్వం మరియు సంస్కృతిల ను మరింత గా సమృద్ధం చేయడం తో పాటు గా మన అభివృద్ధి యాత్ర ను నూతన శిఖరాల కు తీసుకొనిపోతుందన్న విశ్వాసం నాలో ఉంది.’’ అని పేర్కొన్నారు.
माननीय @rashtrapatibhvn जी,
— Narendra Modi (@narendramodi) January 21, 2024
अयोध्या धाम में राम लला की प्राण-प्रतिष्ठा के पावन अवसर पर शुभकामनाओं के लिए आपका बहुत-बहुत आभार। मुझे विश्वास है कि यह ऐतिहासिक क्षण भारतीय विरासत एवं संस्कृति को और समृद्ध करने के साथ ही हमारी विकास यात्रा को नए उत्कर्ष पर ले जाएगा। https://t.co/GdPmx6cluS