జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పిన లతా మంగేష్కర్ గారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రముఖ గాయని శ్రీమతి లతా మంగేష్కర్ గారు సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె గానం చేసిన ఒక గుజరాతీ భజనను తమ ట్వీట్ కు జత చేశారు.
ఆమె శుభాకాంక్షలకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ప్రతిస్పందిస్తూ, "సోదరి లతా మంగేష్కర్ దీవెనలకు చాలా చాలా ధన్యవాదములు. మీకు కూడా జన్మాష్టమి సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు. మీ కంఠ మాధుర్యంతో అలంకరించబడిన ఈ భజన నన్ను మంత్రముగ్ధులను చేసింది." అని హిందీ లో ట్వీట్ చేశారు.
आशीर्वचन के लिए बहुत-बहुत आभार @mangeshkarlata दीदी। आपको भी जन्माष्टमी की अनेकानेक शुभकामनाएं। आपके सुरों से सजा यह भजन मंत्रमुग्ध कर देने वाला है। https://t.co/jzxQq6OXQr
— Narendra Modi (@narendramodi) August 30, 2021