ఎన్నో ఏళ్ల కిందట తాను రచించిన గర్బా గీతాన్ని ఆలపించిన కళాకారులు ధ్వని భానుషాలి, తనిష్క్ బాగ్చి, ‘జస్ట్’ సంగీత బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే నవరాత్రులలో మరో కొత్త గర్బా గీతాన్ని వారితో పంచుకుంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఎన్నో ఏళ్ల కిందట నేను రాసిన గర్బా గీతాన్ని ఇంత మనోహరంగా ఆలపించిన @ధ్వనివినోద్, తనిష్క్ బాగ్చి, @Jjust_Music బృందానికి ధన్యవాదాలు! ఇది ఎన్నో జ్ఞాపకాలను నాకు గుర్తుచేస్తుంది. అప్పటినుంచీ చాలా సంవత్సరాలుగా నేను రచన చేపట్టింది లేదు. కానీ, ఇటీవలే ఓ కొత్త గీతం రాసే వీలుచిక్కింది. దాన్ని దేవీ నవరాత్రుల సందర్భంగా నేను మీతో పంచుకుంటాను.. #SoulfulGarba” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Thank you @dhvanivinod, Tanishk Bagchi and the team of @Jjust_Music for this lovely rendition of a Garba I had penned years ago! It does bring back many memories. I have not written for many years now but I did manage to write a new Garba over the last few days, which I will… https://t.co/WAALGzAfnc
— Narendra Modi (@narendramodi) October 14, 2023