ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న 8వ అంతర్జాతీయ యోగ దినం (ఐడివై) సందర్భం లో వేల మంది అభ్యాసకుల తో కలసి మైసూరు లోని మైసూరు ప్యాలెస్ గ్రౌండు లో నిర్వహించిన ఒక సామూహిక యోగ ప్రదర్శన కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. ఈ సందర్భం లో యావన్మంది ఇతరుల తో సహా కర్నాటక గవర్నరు శ్రీ థావర్ చంద్ గహ్ లోత్, కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మయి మరియు కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద్ సొనొవాల్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం లో మైసూరు వంటి ఆధ్యాత్మిక కేంద్రాల లో వందల సంవత్సరాల నుంచి పెంచి పోషించుకొంటూ వచ్చిన యోగ శక్తి ప్రస్తుతం ప్రపంచ స్వస్థత కు ఒక దిశ ను ఇస్తున్నది అని పేర్కొన్నారు. ఇవాళ యోగ అనేది ప్రపంచ సహకారాని కి ఒక ఆధారం గా మారుతోంది. మరి అది మానవాళి కి ఒక ఆరోగ్యకరమైన జీవనం తాలూకు విశ్వాసాన్ని అందిస్తోంది అని ఆయన అన్నారు. ఇవాళ యోగ కుటుంబాల పరిధి లో నుంచి బయటకు వచ్చి, ప్రపంచం అంతటా వ్యాపించడాన్ని మనం గమనిస్తున్నాం. ఇది ఒక ఆధ్యాత్మికమైన ఆకళింపు తాలూకు ఒక చిత్రం గానే గాక, స్వాభావికమైనటువంటి మరియు ఉమ్మడి మానవ చైతన్యానికి ప్రతీక గా రూపొందింది. ప్రత్యేకించి మునుపు ఎన్నడూ ఎరుగనటువంటి మహమ్మారి తలెత్తిన గత రెండు సంవత్సరాల లో ఈ పరిణామం చోటు చేసుకొంది అని ఆయన అన్నారు. ‘‘యోగ ఇప్పుడు ఒక ప్రపంచ పర్వం గా మారిపోయింది. యోగ ఏ ఒక్క వ్యక్తి కోసమో కాదు, అది యావత్తు మానవ జాతి కోసం. అందువల్ల, ఈ సారి అంతర్జాతీయ యోగ దినం యొక్క ఇతివృత్తం గా ‘మానవజాతి కోసం యోగ’ ను తీసుకోవడం జరిగింది’’ అని ఆయన అన్నారు. ఈ ఇతివృత్తాన్ని ప్రపంచం అంతటికీ తీసుకు పోయినందుకు ఐక్య రాజ్య సమితి కి మరియు అన్ని దేశాల కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
భారతదేశం లో సాధువుల ను, మునుల ను గురించి ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ, ‘‘యోగ మనకు శాంతి ని ప్రసాదిస్తుంది. యోగ నుంచి లభించే శాంతి కేవలం వ్యక్తుల కు ఉద్దేశించింది కాదు. యోగ మన సమాజాని కే శాంతి ని అందిస్తుంది. యోగ మన దేశాల కు మరియు ప్రపంచాని కి శాంతి ని కొనితెస్తుంది. మరి యోగ మన విశ్వాని కి కూడాను శాంతి ని ఇస్తుంది’’ అని కూడా ఆయన అన్నారు. ‘‘ ఈ విశ్వమంతా మీ శరీరం నుంచి మరియు ఆత్మ నుంచి ఆరంభం అవుతుంది. విశ్వం మనలో నుంచే మొదలవుతుంది. మరి, యోగ మనలను మన లోపలి నుంచి ఎరుక పరచి, ఒక జాగృత భావన ను రేకెత్తిస్తుంది’’ అని ఆయన అన్నారు.
దేశం స్వాతంత్య్రం సాధన తాలూకు 75వ సంవత్సరాన్ని.. అమృత్ మహోత్సవాన్ని.. జరుపుకొంటూ ఉన్న కాలం లో ఈ సారి యోగ దినాన్ని భారత పాటిస్తున్నది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. యోగ దినాని కి విస్తృతమైన ఆమోదం లభించడం అనేది భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి శక్తి ని ఇచ్చినటువంటి భారతదేశ అమృత భావన కు లభించినటువంటి అంగీకారం అని చెప్పాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కారణం గానే అంతటా 75 ప్రముఖ స్థానాల లో సామూహిక యోగ ప్రదర్శనల ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్థానాలు అన్నీ కూడాను భారత యొక్క గౌరవశాలి చరిత్ర కు సాక్షీభూతం గా నిలచాయి. అంతేకాదు, ఆ స్థానాలు సాంస్కృతిక శక్తి కేంద్రాలు గా కూడా అలరారాయి అని ఆయన అన్నారు. ‘‘భారత లోని చారిత్రిక స్థలాల లో సామూహిక యోగాభ్యాసం ఎటువంటిదంటే అది భారత యొక్క గతాన్ని, భారత యొక్క వైవిధ్యాన్ని మరియు భారతదేశం యొక్క విస్తరణ ను ఒక సూత్రం గా నేతనేయడం వంటిది’’ అని ఆయన వివరించారు. ‘గార్డియన్ యోగ రింగ్’ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని గురించి కూడా ఆయన ఈ సందర్భం లో తెలియజేశారు. దేశాల సరిహద్దుల ను అధిగమించి యోగ యొక్క సమైక్య శక్తి ని చాటి చెప్పేందుకు విదేశాల లోని భారతదేశ రాయబార కార్యాలయాల తో పాటు గా 79 దేశాలు మరియు ఐక్య రాజ్య సమితి సంస్థ ల మధ్య నిర్వహిస్తున్న ఓ ఏకీకృత శక్తి యొక్క ప్రదర్శన ఇది అని ఆయన అన్నారు. సూర్య గ్రహం ఎలా అయితే ప్రపంచం లో తూర్పు దిక్కు నుంచి పశ్చిమ దిక్కు కు పయనిస్తుందో అదే విధం గా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొంటున్న దేశాల లోని మహా యోగ ప్రదర్శనల ను భూమి మీద ఏదైనా ఒక బిందువు వద్ద నుంచి చూడడం అంటూ జరిగితే గనుక, అది ఒక దాని తరువాత మరొకటి గా దాదాపు గా వంతుల వారీ గా జరుగుతున్నట్లు తోస్తుంది. ఆ రీతి న ‘ఒక సూర్యుడు, ఒక భూమి’ అనే భావన ప్రస్ఫుటం అవుతుంది అని ప్రధాన మంత్రి చెప్పారు. ‘‘యోగ తాలూకు ఈ ప్రయోగం ఆరోగ్యాని కి, సమతౌల్యాని కి మరియు సహకారాని కి ఒక అద్భుతమైన ప్రేరణ ను అందిస్తున్నాయి’’ అని ఆయన అన్నారు.
యోగ అనేది మనకు జీవితం లో ఒక భాగం మాత్రమే కాదు, అది ప్రస్తుతం ఒక జీవించే పద్ధతి గా మారిపోయింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. యోగ ను ఒక ఫలానా కాలానికో మరియు ప్రదేశానికో పరిమితం చేయనక్కరలేదు అని ఆయన అన్నారు. ‘‘మనం ఎంతగా ఒత్తిడి లో ఉన్నప్పటికీ కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేశామా అంటే గనక అది మనకు శాంతి ని కలిగించడం తో పాటు గా మన ఉత్పాదకత ను కూడా పెంచుతుంది. అందువల్ల, మనం యోగ ను ఒక అదనపు పని లా తీసుకోకూడదు. మనం యోగ ను గురించి తప్పక తెలుసుకొని, యోగ కోసం జీవించవలసి ఉంది. అలాగే, మనం యోగ ను సాధించాలి, మనం యోగ ను స్వీకరించాలి. ఎప్పుడైతే మనం యోగ కోసం జీవించడం మొదలు పెడతామో, అప్పుడు యోగ దినం అనేది కేవలం యోగాభ్యాసం చేయడానికి కాదు, మన స్వస్థత, ఆనందం మరియు శాంతి ల తాలూకు ఒక మంగళప్రదమైనటువంటి ఒక వేడుక గా జరుపుకోవడంలా మారుతుంది’’ అని ఆయన వివరించారు.
యోగ తో ముడిపడి ఉన్నటువంటి ఎనలేని అవకాశాల ను గుర్తించే సమయం ఈ రోజు వచ్చేసింది అని చెప్పాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం మన యువత పెద్ద సంఖ్య లో యోగ రంగం లో కొత్త కొత్త ఆలోచనల తో ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ స్టార్ట్-అప్ యోగ చాలెంజ్ అనే కార్యక్రమాన్ని తలపెట్టింది అని కూడా ఆయన వెల్లడించారు. ‘యోగ ను ప్రోత్సహించడం మరియు యోగ ను అభివృద్ధి చేయడం లో ప్రశంసపాత్రమైనటువంటి తోడ్పాటు ను అందిస్తున్నందుకు గాను ప్రధాన మంత్రి పురస్కారాల’ ను 2021వ సంవత్సరాని కి గెలుచుకొన్న వ్యక్తుల కు ప్రధాన మంత్రి అభినందన లు తెలిపారు.
ఎనిమిదో అంతర్జాతీయ యోగ దినం తాలూకు ఉత్సవాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ తో కలిపి మైసూరు లో ప్రధాన మంత్రి ఆధ్వర్యం లో యోగ ప్రదర్శన తో పాటు గా దేశం లోని 75 ప్రముఖ ప్రదేశాల లో 75 మంది కేంద్ర మంత్రుల నాయకత్వం లో సామూహిక యోగ ప్రదర్శనల ను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. వివిధ విద్య సంస్థలు, సామాజిక సంస్థలు, రాజకీయ సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, ధార్మిక సంస్థలు, కార్పొరేట్ సంస్థలు మరియు ఇతర పౌర సమాజ సంస్థల ద్వారా కూడా యోగాభ్యాసాన్ని నిర్వహించడం జరుగుతోంది. వీటిలో దేశవ్యాప్తం గా కోట్ల కొద్దీ ప్రజలు భాగం పంచుకొంటున్నారు.
మైసూరు లో ప్రధాన మంత్రి పాల్గొన్న యోగ కార్యక్రమం వినూత్నమైన ‘గార్డియన్ యోగ రింగ్’ అనే ఒక కార్యక్రమం లో భాగం గా ఉంది. ఇది దేశాల సరిహద్దుల ను అతీతంగా, యోగ యొక్క సమైక్య శక్తి ని చాటి చెప్పేందుకు విదేశాల లోని భారతదేశ రాయబార కార్యాలయాల తో పాటు గా 79 దేశాలు మరియు ఐక్య రాజ్య సమితి సంస్థల మధ్య నిర్వహిస్తున్నటువంటి యోగ తాలూకు ఏకీకృత శక్తి ని చాటిచెప్పేది అన్నమాట.
అంతర్జాతీయ యోగ దినం (ఐడివై) ని 2015వ సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఏటా జూన్ 21వ తేదీ నాడు ప్రపంచం అంతటా జరుపుకొంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం యోగ దినం ఇతి వృత్తం ఏమిటి అంటే అది ‘మానవ జాతి కోసం యోగ’. ఈ ఇతి వృత్తం కోవిడ్ మహమ్మారి కాలం లో రోగ పీడ ను నివారించడం లో యోగ మానవ మాత్రుల కు ఏ విధం గా సేవ చేసిందో సూచిస్తున్నది.
मैसूरू जैसे भारत के आध्यात्मिक केन्द्रों ने जिस योग-ऊर्जा को सदियों से पोषित किया, आज वो योग ऊर्जा विश्व स्वास्थ्य को दिशा दे रही है।
— PMO India (@PMOIndia) June 21, 2022
आज योग वैश्विक सहयोग का पारस्परिक आधार बन रहा है।
आज योग मानव मात्र को निरोग जीवन का विश्वास दे रहा है: PM @narendramodi
योग अब एक वैश्विक पर्व बन गया है।
— PMO India (@PMOIndia) June 21, 2022
योग किसी व्यक्ति मात्र के लिए नहीं, संपूर्ण मानवता के लिए है।
इसलिए, इस बार अंतर्राष्ट्रीय योग दिवस की थीम है- Yoga for humanity: PM @narendramodi
Yoga brings peace for us.
— PMO India (@PMOIndia) June 21, 2022
The peace from yoga is not merely for individuals.
Yoga brings peace to our society.
Yoga brings peace to our nations and the world.
And, Yoga brings peace to our universe: PM @narendramodi
This whole universe starts from our own body and soul.
— PMO India (@PMOIndia) June 21, 2022
The universe starts from us.
And, Yoga makes us conscious of everything within us and builds a sense of awareness: PM @narendramodi
भारत में हम इस बार योग दिवस हम एक ऐसे समय पर मना रहे हैं जब देश अपनी आजादी के 75वें वर्ष का पर्व मना रहा है, अमृत महोत्सव मना रहा है।
— PMO India (@PMOIndia) June 21, 2022
योग दिवस की ये व्यापकता, ये स्वीकार्यता भारत की उस अमृत भावना की स्वीकार्यता है जिसने भारत के स्वतन्त्रता संग्राम को ऊर्जा दी थी: PM
अंतर्राष्ट्रीय स्तर पर भी हमने इस बार “Guardian Ring of Yoga” का ऐसा ही अभिनव प्रयोग विश्व भर में हो रहा है।
— PMO India (@PMOIndia) June 21, 2022
दुनिया के अलग-अलग देशों में सूर्योदय के साथ, सूर्य की गति के साथ, लोग योग कर रहे हैं: PM @narendramodi
दुनिया के लोगों के लिए योग आज हमारे लिए केवल part of life नहीं, बल्कि योग अब way of life बन रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 21, 2022
हम कितने तनावपूर्ण माहौल में क्यों न हों, कुछ मिनट का ध्यान हमें relax कर देता है, हमारी productivity बढ़ा देता है।
— PMO India (@PMOIndia) June 21, 2022
इसलिए, हमें योग को एक अतिरिक्त काम के तौर पर नहीं लेना है।
हमें योग को जानना भी है, हमें योग को जीना भी है।
हमें योग को पाना भी है, हमें योग को अपनाना भी है: PM