మైసూరు లో ప్రధాన మంత్రి పాల్గొన్న యోగ కార్యక్రమం తో పాటుగా, దేశమంతటా 75 ప్రముఖ స్థలాల లో మహా యోగ ప్రదర్శన లుజరిగాయి
వివిధ ప్రభుత్వేతర సంస్థలు కూడా దేశవ్యాప్తం గా పెద్ద యోగ ప్రదర్శనకార్యక్రమాల ను ఏర్పాటు చేయగా, ఆయా ప్రదర్శనల లో కోట్ల కొద్దీ ప్రజలు పాలుపంచుకొన్నారు
మైసూరు లో ప్రధాన మంత్రి పాల్గొన్న యోగ కార్యక్రమం ‘ఒక సూర్యుడు, ఒక భూమి’ భావన ను నొక్కి చెప్తూ చేపట్టిన ‘గార్డియన్ యోగ రింగ్’ అనే ఒక వినూత్న కార్యక్రమం లో ఒక భాగంగా ఉంది
‘‘యోగ ఏ ఒక్క వ్యక్తి కోసమో కాదు, అది యావత్తు మానవజాతి కోసం ఉద్దేశించింది’’
‘‘మన సమాజాని కి, దేశాల కు, ప్రపంచాని కి శాంతి ని యోగ ప్రసాదిస్తుంది; యోగ మన విశ్వానికే శాంతి ని ప్రసాదిస్తుంది’’
‘‘యోగ దినాని కి లభించినటువంటి ఈ విస్తృత ఆమోదం భారతదేశం యొక్క అమృతభావన కు లభించిన అంగీకారం; అది భారతదేశం యొక్క స్వాతంత్య్రపోరాటాని కి శక్తి ని ఇచ్చింది’’
‘‘భారతదేశం లోని చరిత్రాత్మక స్థలాల లో సామూహిక యోగాభ్యాసం లో పాల్గొన్న అనుభవంఎటువంటిది అంటే అది భారతదేశం యొక్క గతాన్ని, భారతదేశం యొక్క వైవిధ్యాన్ని మరియుభారతదేశం యొక్క విస్తరణ ను కలిపికట్టు గా ఉంచడం లాంటిది’’
‘‘యోగాభ్యాసాలతో ఆరోగ్యాని కి, సమతుల్యత కు మరియు సహకారాని కి అద్భుతమైన ప్రేరణ లభిస్తుంది’’
‘‘యోగ తో ముడిపడిన అనంతమైన అవకాశాల ను మనం గుర్తించవలసిన కాలం ఈ రోజు న వచ్చేసింది’’
‘‘ఎప్పుడైతే మనం యోగ ను జీవించడం మొదలు పెడతామో, అప్పుడు యోగ దినం అనేది మన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని మరియు శాంతి ని మంగళప్రదమైనటువంటిఒక వేడుక గా జరుపుకొనే మాధ్యమం గా మారిపోతుంది’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న 8వ అంతర్జాతీయ యోగ దినం (ఐడివై) సందర్భం లో వేల మంది అభ్యాసకుల తో కలసి మైసూరు లోని మైసూరు ప్యాలెస్ గ్రౌండు లో నిర్వహించిన ఒక సామూహిక యోగ ప్రదర్శన కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. ఈ సందర్భం లో యావన్మంది ఇతరుల తో సహా కర్నాటక గవర్నరు శ్రీ థావ‌ర్ చంద్ గహ్ లోత్, కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మయి మరియు కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద్ సొనొవాల్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం లో మైసూరు వంటి ఆధ్యాత్మిక కేంద్రాల లో వందల సంవత్సరాల నుంచి పెంచి పోషించుకొంటూ వచ్చిన యోగ శక్తి ప్రస్తుతం ప్రపంచ స్వస్థత కు ఒక దిశ ను ఇస్తున్నది అని పేర్కొన్నారు. ఇవాళ యోగ అనేది ప్రపంచ సహకారాని కి ఒక ఆధారం గా మారుతోంది. మరి అది మానవాళి కి ఒక ఆరోగ్యకరమైన జీవనం తాలూకు విశ్వాసాన్ని అందిస్తోంది అని ఆయన అన్నారు. ఇవాళ యోగ కుటుంబాల పరిధి లో నుంచి బయటకు వచ్చి, ప్రపంచం అంతటా వ్యాపించడాన్ని మనం గమనిస్తున్నాం. ఇది ఒక ఆధ్యాత్మికమైన ఆకళింపు తాలూకు ఒక చిత్రం గానే గాక, స్వాభావికమైనటువంటి మరియు ఉమ్మడి మానవ చైతన్యానికి ప్రతీక గా రూపొందింది. ప్రత్యేకించి మునుపు ఎన్నడూ ఎరుగనటువంటి మహమ్మారి తలెత్తిన గత రెండు సంవత్సరాల లో ఈ పరిణామం చోటు చేసుకొంది అని ఆయన అన్నారు. ‘‘యోగ ఇప్పుడు ఒక ప్రపంచ పర్వం గా మారిపోయింది. యోగ ఏ ఒక్క వ్యక్తి కోసమో కాదు, అది యావత్తు మానవ జాతి కోసం. అందువల్ల, ఈ సారి అంతర్జాతీయ యోగ దినం యొక్క ఇతివృత్తం గా ‘మానవజాతి కోసం యోగ’ ను తీసుకోవడం జరిగింది’’ అని ఆయన అన్నారు. ఈ ఇతివృత్తాన్ని ప్రపంచం అంతటికీ తీసుకు పోయినందుకు ఐక్య రాజ్య సమితి కి మరియు అన్ని దేశాల కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

భారతదేశం లో సాధువుల ను, మునుల ను గురించి ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ, ‘‘యోగ మనకు శాంతి ని ప్రసాదిస్తుంది. యోగ నుంచి లభించే శాంతి కేవలం వ్యక్తుల కు ఉద్దేశించింది కాదు. యోగ మన సమాజాని కే శాంతి ని అందిస్తుంది. యోగ మన దేశాల కు మరియు ప్రపంచాని కి శాంతి ని కొనితెస్తుంది. మరి యోగ మన విశ్వాని కి కూడాను శాంతి ని ఇస్తుంది’’ అని కూడా ఆయన అన్నారు. ‘‘ ఈ విశ్వమంతా మీ శరీరం నుంచి మరియు ఆత్మ నుంచి ఆరంభం అవుతుంది. విశ్వం మనలో నుంచే మొదలవుతుంది. మరి, యోగ మనలను మన లోపలి నుంచి ఎరుక పరచి, ఒక జాగృత భావన ను రేకెత్తిస్తుంది’’ అని ఆయన అన్నారు.

దేశం స్వాతంత్య్రం సాధన తాలూకు 75వ సంవత్సరాన్ని.. అమృత్ మహోత్సవాన్ని.. జరుపుకొంటూ ఉన్న కాలం లో ఈ సారి యోగ దినాన్ని భారత పాటిస్తున్నది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. యోగ దినాని కి విస్తృతమైన ఆమోదం లభించడం అనేది భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి శక్తి ని ఇచ్చినటువంటి భారతదేశ అమృత భావన కు లభించినటువంటి అంగీకారం అని చెప్పాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కారణం గానే అంతటా 75 ప్రముఖ స్థానాల లో సామూహిక యోగ ప్రదర్శనల ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్థానాలు అన్నీ కూడాను భారత యొక్క గౌరవశాలి చరిత్ర కు సాక్షీభూతం గా నిలచాయి. అంతేకాదు, ఆ స్థానాలు సాంస్కృతిక శక్తి కేంద్రాలు గా కూడా అలరారాయి అని ఆయన అన్నారు. ‘‘భారత లోని చారిత్రిక స్థలాల లో సామూహిక యోగాభ్యాసం ఎటువంటిదంటే అది భారత యొక్క గతాన్ని, భారత యొక్క వైవిధ్యాన్ని మరియు భారతదేశం యొక్క విస్తరణ ను ఒక సూత్రం గా నేతనేయడం వంటిది’’ అని ఆయన వివరించారు. ‘గార్డియన్ యోగ రింగ్’ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని గురించి కూడా ఆయన ఈ సందర్భం లో తెలియజేశారు. దేశాల సరిహద్దుల ను అధిగమించి యోగ యొక్క సమైక్య శక్తి ని చాటి చెప్పేందుకు విదేశాల లోని భారతదేశ రాయబార కార్యాలయాల తో పాటు గా 79 దేశాలు మరియు ఐక్య రాజ్య సమితి సంస్థ ల మధ్య నిర్వహిస్తున్న ఓ ఏకీకృత‌ శక్తి యొక్క ప్రదర్శన ఇది అని ఆయన అన్నారు. సూర్య గ్రహం ఎలా అయితే ప్రపంచం లో తూర్పు దిక్కు నుంచి పశ్చిమ దిక్కు కు పయనిస్తుందో అదే విధం గా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొంటున్న దేశాల లోని మహా యోగ ప్రదర్శనల ను భూమి మీద ఏదైనా ఒక బిందువు వద్ద నుంచి చూడడం అంటూ జరిగితే గనుక, అది ఒక దాని తరువాత మరొకటి గా దాదాపు గా వంతుల వారీ గా జరుగుతున్నట్లు తోస్తుంది. ఆ రీతి న ‘ఒక సూర్యుడు, ఒక భూమి’ అనే భావన ప్రస్ఫుటం అవుతుంది అని ప్రధాన మంత్రి చెప్పారు. ‘‘యోగ తాలూకు ఈ ప్రయోగం ఆరోగ్యాని కి, సమతౌల్యాని కి మరియు సహకారాని కి ఒక అద్భుతమైన ప్రేరణ ను అందిస్తున్నాయి’’ అని ఆయన అన్నారు.

యోగ అనేది మనకు జీవితం లో ఒక భాగం మాత్రమే కాదు, అది ప్రస్తుతం ఒక జీవించే పద్ధతి గా మారిపోయింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. యోగ ను ఒక ఫలానా కాలానికో మరియు ప్రదేశానికో పరిమితం చేయనక్కరలేదు అని ఆయన అన్నారు. ‘‘మనం ఎంతగా ఒత్తిడి లో ఉన్నప్పటికీ కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేశామా అంటే గనక అది మనకు శాంతి ని కలిగించడం తో పాటు గా మన ఉత్పాదకత ను కూడా పెంచుతుంది. అందువల్ల, మనం యోగ ను ఒక అదనపు పని లా తీసుకోకూడదు. మనం యోగ ను గురించి తప్పక తెలుసుకొని, యోగ కోసం జీవించవలసి ఉంది. అలాగే, మనం యోగ ను సాధించాలి, మనం యోగ ను స్వీకరించాలి. ఎప్పుడైతే మనం యోగ కోసం జీవించడం మొదలు పెడతామో, అప్పుడు యోగ దినం అనేది కేవలం యోగాభ్యాసం చేయడానికి కాదు, మన స్వస్థత, ఆనందం మరియు శాంతి ల తాలూకు ఒక మంగళప్రదమైనటువంటి ఒక వేడుక గా జరుపుకోవడంలా మారుతుంది’’ అని ఆయన వివరించారు.

యోగ తో ముడిపడి ఉన్నటువంటి ఎనలేని అవకాశాల ను గుర్తించే సమయం ఈ రోజు వచ్చేసింది అని చెప్పాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం మన యువత పెద్ద సంఖ్య లో యోగ రంగం లో కొత్త కొత్త ఆలోచనల తో ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ స్టార్ట్-అప్ యోగ చాలెంజ్ అనే కార్యక్రమాన్ని తలపెట్టింది అని కూడా ఆయన వెల్లడించారు. ‘యోగ ను ప్రోత్సహించడం మరియు యోగ ను అభివృద్ధి చేయడం లో ప్రశంసపాత్రమైనటువంటి తోడ్పాటు ను అందిస్తున్నందుకు గాను ప్రధాన మంత్రి పురస్కారాల’ ను 2021వ సంవత్సరాని కి గెలుచుకొన్న వ్యక్తుల కు ప్రధాన మంత్రి అభినందన లు తెలిపారు.

ఎనిమిదో అంతర్జాతీయ యోగ దినం తాలూకు ఉత్సవాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ తో కలిపి మైసూరు లో ప్రధాన మంత్రి ఆధ్వర్యం లో యోగ ప్రదర్శన తో పాటు గా దేశం లోని 75 ప్రముఖ ప్రదేశాల లో 75 మంది కేంద్ర మంత్రుల నాయకత్వం లో సామూహిక యోగ ప్రదర్శనల ను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. వివిధ విద్య సంస్థలు, సామాజిక సంస్థలు, రాజకీయ సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, ధార్మిక సంస్థలు, కార్పొరేట్ సంస్థలు మరియు ఇతర పౌర సమాజ సంస్థల ద్వారా కూడా యోగాభ్యాసాన్ని నిర్వహించడం జరుగుతోంది. వీటిలో దేశవ్యాప్తం గా కోట్ల కొద్దీ ప్రజలు భాగం పంచుకొంటున్నారు.

మైసూరు లో ప్రధాన మంత్రి పాల్గొన్న యోగ కార్యక్రమం వినూత్నమైన ‘గార్డియన్ యోగ రింగ్’ అనే ఒక కార్యక్రమం లో భాగం గా ఉంది. ఇది దేశాల సరిహద్దుల ను అతీతంగా, యోగ యొక్క సమైక్య శక్తి ని చాటి చెప్పేందుకు విదేశాల లోని భారతదేశ రాయబార కార్యాలయాల తో పాటు గా 79 దేశాలు మరియు ఐక్య రాజ్య సమితి సంస్థల మధ్య నిర్వహిస్తున్నటువంటి యోగ తాలూకు ఏకీకృత‌ శక్తి ని చాటిచెప్పేది అన్నమాట.

అంతర్జాతీయ యోగ దినం (ఐడివై) ని 2015వ సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఏటా జూన్ 21వ తేదీ నాడు ప్రపంచం అంతటా జరుపుకొంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం యోగ దినం ఇతి వృత్తం ఏమిటి అంటే అది ‘మానవ జాతి కోసం యోగ’. ఈ ఇతి వృత్తం కోవిడ్ మహమ్మారి కాలం లో రోగ పీడ ను నివారించడం లో యోగ మానవ మాత్రుల కు ఏ విధం గా సేవ చేసిందో సూచిస్తున్నది.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage