భారతదేశం లోని ప్రధాన పారిశ్రామిక సంస్థలు అలాగే, 100కు పైగా ఎమ్ఎస్ఎమ్ఇ లు సరఫరా చేసినస్వదేశీ ఉపకరణాల ను, యంత్రాల ను ఉపయోగించి ఐఎన్ఎస్ విక్రాంత్ నురూపొందించడమైంది
ఇది భారతదేశం సముద్ర సంబంధి చరిత్ర లో నిర్మాణం అయిన అతి విశాలమైనటువంటినౌక; దీని లో అత్యాధునిక ఆటోమేశన్ సంబంధివిశేషాల ను జతపరచడమైంది
వలసవాదం తాలూకు గతించిన కాలానికి భిన్నం గా, నౌకాదళాని కి ఒక కొత్త జెండాను ప్రధాన మంత్రి ఆవిష్కరించారు; అంతేకాక ఆ చిహ్నాన్ని ఛత్రపతి శ్రీ శివాజి కి అంకితంచేశారు
‘‘ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం ఓ యుద్ధ నౌక కాదు. ఇది ఇరవై ఒకటోశతాబ్ది భారతదేశం యొక్క కఠోర శ్రమ, ప్రతిభ, ప్రభావం మరియు నిబద్ధత లకు ఒక ప్రమాణం గా ఉంది’’
‘‘భారతదేశం స్వయం సమృద్ధం గా మారుతోందని సూచిస్తున్న ఒక అద్వితీయమైన ప్రతిబింబమేఐఎన్ఎస్ విక్రాంత్’’
‘‘ఐఎన్ఎస్ విక్రాంత్ స్వదేశీ సామర్థ్యం, స్వదేశీ వనరులు మరియు స్వదేశీ కౌశలం.. వీటికిఒక ప్రతీక గా ఉంది’’
‘‘ఇంతకాలం భారతదేశం నౌకాదళం యొక్క ధ్వజం లో బానిసత్వం తాలూకు ఛాయ ఉంటూ వచ్చింది. కానీ, ఈ రోజు నుండి ఛత్రపతి శ్రీ శివాజిద్వారా ప్రేరణ ను పొందిన, నౌకాదళం యొక్క సరికొత్త పతాకం సముద్ర జలాల లోను, గగనతలంలోను రెపరెపలాడుతుంది’’
‘విక్రాంత్ లో నౌకాదళాని కి చెందిన మహిళా సైనికులుఅనేక మంది విధుల ను నిర్వర్తించనున్నారు. మహాసముద్రానికి ఉన్న అపారమైన శక్తి తోపాటే అపరిమితమైన నారీ శక్తి సమేతం గా, ఇది నవ భారతదేశం తాలూకు సమున్నతమైనటువంటి గుర్తింపుగా మారుతున్నది’’

స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం తో తయారైన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న దేశ ప్రజల సేవ కు గాను సమర్పించారు. వలసవాద హయాము తాలూకు గతాని కి అతీతం గా మరియు సమృద్ధమైనటువంటి భారతదేశం సముద్ర సంబంధి వారసత్వాని కి ప్రతిరూపం గా నౌకాదళాని కి కొత్త ధ్వజాన్ని (చిహ్నాన్ని) కూడా ప్రధాన మంత్రి ఇదే కార్యక్రం లో ఆవిష్కరించారు.

కార్యక్రమానికి విచ్చేసిన సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు న భారతదేశం లోని కేరళ కోస్తా తీర ప్రాంతం లో ఒక సరికొత్త భవిష్యత్తు తాలూకు సూర్యోదయాన్ని భారతదేశం లోని ప్రతి ఒక్కరు చూస్తున్నారు అని పేర్కొన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఉవ్వెత్తున్న ఎగసిపడుతున్న భారతదేశం యొక్క ఉత్సాహాని కి ఒక అంజలి గా ఉంది అని ఆయన అన్నారు. ఒక సమర్ధమైనటువంటి మరియు దృఢమైనటువంటి భారతదేశం ఏర్పడడం గురించి స్వాతంత్య్ర యోధులు కన్న కల లు నెరవేరడాన్ని ఈ రోజు న మనం గమనిస్తున్నాం అని ఆయన అన్నారు. ‘‘విక్రాంత్ భారీ అయినటువంటి, బ్రహ్మండమైనటువంటి మరియు సువిశాలమైనటువంటి యుద్ధ విమాన వాహక నౌక. విక్రాంత్ ఎంతో ప్రసిద్ధమైంది, ప్రత్యేకమైంది కూడాను. విక్రాంత్ ఓ యుద్ధ నౌక మాత్రమే కాదు, అది ఇరవై ఒకటో శతాబ్దం లో భారతదేశం యొక్క కఠోర శ్రమ, ప్రతిభ, ప్రభావం, ఇంకా నిబద్ధతల కు ఒక నిదర్శన గా ఉంది. పెట్టుకొన్న లక్ష్యాలు సుదూరం గా, యాత్ర లు సుదీర్ఘమైనవి గా, సముద్రం మరియు సవాళ్లు అంతు లేని అటువంటివి గా ఉన్నాయంటే గనక వాటికి భారతదేశం ఇచ్చే జవాబే విక్రాంత్ గా రూపు రేఖల ను దిద్దుకొంది అని ఆయన అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో వెలికి వచ్చిన సాటి లేని అమృతం గా ఉంది ఈ విక్రాంత్. స్వయం సమృద్ధం గా మారుతున్న భారతదేశం యొక్క అద్వితీయ ప్రతిబింబమే విక్రాంత్’’ అంటూ ప్రధాన మంత్రి వర్ణన చేశారు.

దేశం లో కొత్త వాతావరణం గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, నేటి భారతదేశాని కి ఏ సవాలు అయినా సరే కష్టమైంది కానే కాదు అన్నారు. ‘‘ప్రపంచం లో ఇంత పెద్ద యుద్ధ విమాన వాహక నౌక ను పూర్తి గా దేశం లోనే తయారు చేసుకోగలిగిన అటువంటి కొన్ని దేశాల సరసన ఒక దేశం గా భారతదేశం సైతం ప్రస్తుతం నిలచింది. ఈ రోజు ఐఎన్ఎస్ విక్రాంత్ దేశం లో ఒక సరికొత్త విశ్వాసాన్ని నింపివేసింది, దేశం లో ఒక వినూత్నమైన బరోసా అంకురించింది’’ అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కృషి చేసిన నౌకాదళం, కోచీన్ శిప్ యార్డు కు చెందిన ఇంజీనియర్ లు, శాస్త్రవేత్త ల, మరీ ముఖ్యం గా దీని నిర్మాణం లో పాలుపంచుకొన్న శ్రమికుల సేవల ను ప్రధాన మంత్రి ప్రస్తావించి తన ప్రశంసల ను వ్యక్తం చేశారు. మంగళప్రదం , ఆనందప్రదం అయిన ఓణమ్ సందర్భాన్ని గురించి ఆయన గుర్తు కు తెస్తూ, ఈ పర్వదినం ప్రస్తుత సందర్భాని కి మరింత ప్రసన్నత ను జోడించింది అన్నారు.

ఐఎన్ఎస్ విక్రాంత్ లో ప్రతి ఒక్క భాగాని కి దానికంటూ ఒక సుగుణం, ఒక శక్తి, దానికంటూ ఒక అభివృద్ధి క్రమం అనేవి సైతం ఉన్నాయి. దీని రూపకల్పన జరిగిన తీరే అపురూపం, అది దేశవాళీ సామర్థ్యం, దేశవాళీ వనరులు, దేశవాళీ నైపుణ్యాల కు ఒక సంకేతం గా ఉంది. దీని యొక్క ఎయర్ బేస్ లో అమర్చినటువంటి ఉక్కు ను డిఆర్ డిఒ కు చెందిన శాస్త్రవేత్త లు అభివృద్ధి పరచగా, భారతదేశం లోని కంపెనీ లు ఆ యొక్క ఉక్కు ను ఉత్పత్తి చేశాయి అని ఆయన తెలిపారు. ఈ నౌక లో విశాలమైన భాగాల ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, చూడబోతే ఇది సముద్రం అలల పైన తేలి ఆడుతున్నటువంటి ఒక నగరమా అన్నట్లుగా ఉందన్నారు. ఇది ఎంతటి విద్యుత్తు ను తయారు చేస్తుంది అంటే ఆ విద్యుత్తు 5,000 కుటుంబాలు వినియోగించుకోవడాని కి సరిపోతుంది, మరి దీనిలో వినియోగించిన విద్యుత్తు తంత్రుల ను గనక పరుచుకుంటూ పోతే అవి కోచి నుండి కాశీ కి చేరుకొంటాయి అని ఆయన అన్నారు. ఎర్ర కోట బురుజు ల నుండి తాను ప్రకటించిన ‘పంచ ప్రణ్’ ల యొక్క భావన కు ఒక సంగ్రహమైన సజీవ ప్రతీక లా ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది అని ఆయన అన్నారు.

భారతదేశం సముద్ర సంబంధి సంప్రదాయం, నౌకాదళ శక్తియుక్తుల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. ఛత్రపతి వీర్ శివాజీ మహారాజ్ ఈ తరహా నౌకాదళాన్ని నిర్మించారు, మరి ఈ సముద్ర సంబంధి శక్తి యొక్క అండదండలే శత్రువుల కు కంటి మీద కునుకు లేకుండా చేసివేసేవి. బ్రిటిషు వారు భారతదేశాని కి తరలి వచ్చినప్పుడు, వారు భారతదేశాని కి చెందిన నౌకల ను చూసి, వాటి ద్వారా జరిగే వ్యాపారం తాలూకు బలాన్ని చూసి గుబులుపడే వారు. ఈ కారణం గా వారు భారతదేశం యొక్క సముద్ర సామర్థ్యం వెన్ను ను విరచాలనే నిర్ణయాన్ని తీసుకొన్నారు. ఏ విధంగా ఆ కాలం లో బ్రిటిషు పార్లమెంటు లో చట్టాన్ని చేసి భారతదేశాని కి చెందిన నౌకల పైన మరియు వర్తకుల పైన కఠినమైన ఆంక్షల ను విధించారో దానికి చరిత్ర యే సాక్షి గా నిలచింది అని ప్రధాన మంత్రి అన్నారు.

ఈ రోజు న 2022వ సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీ ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజు, నేటి రోజు న భారతదేశం బానిసత్వం తాలూకు ఒక గుర్తు ను, బానిసత్వం యొక్క ఒక పెద్ద భారాన్ని గుండె మీద నుండ వదలించుకొన్నది. ఈ రోజు నుండి భారతదేశం నౌకాదళానికి ఒక కొత్త జెండా లభించింది. ఇంత వరకు భారతదేశం నౌకాదళం యొక్క ధ్వజం దాస్యం లో మగ్గిపోయి ఉండేది, కానీ ఈ రోజు మొదలుకొని ఛత్రపతి శ్రీ శివాజి యొక్క ప్రేరణ తో నౌకాదళం యొక్క నూతన పతాకం సముద్రం లో, ఆకాశం లో రెపరెప లాడుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

విక్రాంత్ మన సముద్ర రంగ సురక్ష కోసం ఎప్పుడైతే రంగం లోకి దిగుతుందో, అప్పుడు దానిలో నౌకాదళాని కి చెందిన అనేక మంది మహిళా జవాను లు కూడాను మోహరించి ఉంటారు అని ప్రధాన మంత్రి అన్నారు. సముద్రాని కి ఉన్న అపారమైన శక్తి తో పాటు ఎల్ల లు ఎరుగనటువంటి నారీ శక్తి ఇవి నవ భారతదేశం తాలూకు సమున్నత గుర్తింపు గా మారుతున్నాయన్నారు. ఇక భారతదేశం నౌకాదళం తన అన్ని విభాగాల ను మహిళల ను భర్తీ చేసుకోవడం కోసం అనుమతించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉన్న ఆంక్షల ను ఇక తొలగించడం జరుగుతోంది. సమర్థమైన అలల కు ఎలాగయితే పరిధులు అంటూ ఉండవో, అలాగే భారతదేశాని కి చెందిన కుమార్తె ల కు ఇక ఎటువంటి ఎల్లలు గాని లేదా బంధనం గాని ఉండవు అని ఆయన అన్నారు.

ఒక్కొక్క బిందువే ఒక విరాట మహాసముద్రంగా మారుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సారి స్వాతంత్య్ర దినం నాడు స్వదేశీ ఫిరంగుల తో వందన సమర్పణ జరిగింది అని కూడా ఆయన ప్రస్తావించారు. అదే విధం గా భారతదేశం లో ప్రతి ఒక్క పౌరుడు/ పౌరురాలు ‘వోకల్ ఫార్ లోకల్’ (స్వదేశీ ఉత్పత్తుల ను సమర్థించుదాం) అనే మంత్రాన్ని అనుసరిస్తూ మనుగడ సాగించడాన్ని మొదలు పెడతారని, అదే జరిగినప్పుడు దేశం స్వయం సమృద్ధం కావడానికి ఎక్కువ కాలం పట్టదు అని ఆయన అన్నారు.

భౌగోళికం గా మరియు వ్యూహాత్మకం గా పరిస్థితి లో మార్పులు చోటుచేసుకోవడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, గత కాలం లో ఇండో- పసిఫిక్ రీజియన్ లోను, హిందూ మహాసముద్ర ప్రాంతం లోను భద్రత పరమైనటువంటి ఆందోళనల ను ఎంతో కాలం పాటు చిన్నచూపు చూడడం జరిగిందన్నారు. అయితే, ప్రస్తుతం ఈ ప్రాంతం మనలకు దేశం యొక్క ప్రధానమైన రక్షణ ప్రాథమ్యం గా ఉందని ఆయన చెప్పారు. ఈ కారణం గానే మేం నౌకాదళాని కి ఉద్దేశించిన బడ్జెటు ను పెంచడం మొదలుకొని, నౌకాదళం శక్తియుక్తుల ను అధికం చేయడం కోసం ప్రతి దిశ లో కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. శక్తిశాలి భారతదేశం ఒక శాంతియుతమైనటువంటి మరియు భద్రమైనటువంటి ప్రపంచాని కి బాట ను పరచగలదని ప్రధాన మంత్రి అన్నారు.

ఈ సందర్బం లో కేర‌ళ గ‌వ‌ర్న‌రు శ్రీ ఆరిఫ్ మొహ‌మ్మ‌ద్ ఖాన్, కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరాయీ విజయన్, కేంద్ర మంత్రులు శ్రీయుతులు రాజ్ నాథ్ సింహ్, శ్రీ సర్బానంద సోనోవాల్, వి. మురళీధరన్, అజయ్ భట్, జాతీయ భద్రత సలహాదారు శ్రీ అజీత్ డోభాల్, నౌకాదళం ప్రధానాధికారి శ్రీ ఆర్. హరి కుమార్ లు సహా ఇతరులు హాజరు అయ్యారు.

ఐఎన్ఎస్ విక్రాంత్

ఐఎన్ఎస్ విక్రాంత్ కు ఆకృతి ని భారతదేశం నౌకాదళం లోని వార్ శిప్ డిజైన్ బ్యూరో (డబ్ల్యుడిబి) అందించగా, ఈ నౌక ను నౌకాశ్రయాలు, శిపింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో నడుస్తున్న సార్వజనిక రంగానికి చెందిన శిప్ యార్డ్ కంపెనీ కోచీన్ శిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. అత్యాధునిక ఆటోమేశన్ సదుపాయాల తో విక్రాంత్ ను నిర్మించడమైంది. అది భారతదేశం యొక్క సముద్ర సంబంధి చరిత్ర లో ఇంతవరకు నిర్మాణం అయిన నౌక లు అన్నిటిలోకీ అతి విశాలమైన నౌక అని చెప్పుకోవాలి.

ఈ దేశవాళీ విమాన వాహక నౌక కు దీనికి ముందు సేవల ను అందించినటువంటి మరియు భారతదేశాని కి తొలి యుద్ధ విమాన వాహక నౌక అయినటువంటి నౌక యొక్క పేరు నే పెట్టారు. ఆ నౌక 1971వ సంవత్సరం జరిగిన యుద్ధం లో ఒక ముఖ్య పాత్ర ను పోషించింది. తాజా నౌక కు స్వదేశీ ఉపకరణాల ను, యంత్ర పరికరాల ను పెద్ద సంఖ్య లో అమర్చడం జరిగింది. వీటి నిర్మాణం దేశం లోని ప్రధానమైన పారిశ్రామిక సంస్థ లు మరియు 100 కు పైగా సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా వాణిజ్య సంస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ) ల ద్వారా జరిగింది. విక్రాంత్ ను దేశ సేవ కు సమర్పణం చేయడం తో ఇక భారతదేశం వద్ద రెండు యుద్ధ విమాన వాహక నౌక లు క్రియాశీలం కానున్నాయి; వాటి తో దేశ సముద్ర సంబంధి సురక్ష కు చాలా బలం లభిస్తుంది.

వలస హయాము సంప్రదాయాని కి అతీతం గా, సమృద్ధమైన భారతదేశ సముద్ర సంబంధి వారసత్వ ప్రతీక కు అనుగుణం గా రూపొందించినటువంటి నౌకాదళ నూతన ధ్వజాన్ని (చిహ్నాన్ని) కూడా ప్రధాన మంత్రి ఇదే కార్యక్రమం లో ఆవిష్కరించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi